డైరెక్టర్ పూరి జగన్నాధ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ స్ట్రాంగ్ గా వసూళ్లు చేస్తుంది. ఇప్పటికే ఈమూవీ 70 కోట్లకు చేరువలో ఉంది. ప్రస్తుతం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న పూరి లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో ప్రొడ్యూసర్ గా తను పడే ఇబ్బందులు గురించి చెప్పాడు. తనకి దర్శకుడిగా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ సినిమాను నిర్మించినప్పుడు మాత్రం నన్ను చాలా సంఘటనలు బాధ పెట్టాయి. ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చాలామంది టార్గెట్ చేస్తారు అని నిర్మాతలతో ఆడుకుంటారని నాకు ప్రొడ్యూసర్ అయ్యాకే తెలిసింది. ఇది నా ఒక్కడికే కాదు అందరి నిర్మాతలకి ఇటువంటివి కామన్.
వ్యక్తిగతంగా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకున్నా నిర్మాతగా నన్ను చాలా ఆడుకున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్ది ఈ టార్చర్ మరీ ఎక్కువ అవుతుంది. చాలామంది సినిమాని ఆపడానికి ట్రై చేస్తారు. సినిమా రిలీజ్ అయేటప్పుడు అది ఆడుతుందా లేదా అనే టెన్షన్ కంటే వారు పెట్టే ఇబ్బందులతో నిర్మాతలు నరకం చూస్తారు. సినిమా హిట్ అయితే పర్లేదు ఒకవేళ ప్లాప్ అయితే మాత్రం మరో రకం ఇబ్బంది ఎదురవుతుంది. ఇలా ప్రతి సినిమాకి కామనే. నన్ను ఇబ్బంది పెట్టిన వారి పేరులు త్వరలోనే వెల్లడిస్తా. అసలు పూరిని అంతలా ఇబ్బంది పెడుతున్న వారు ఎవరు? అనేది తెలియాలంటే పూరి చెప్పేవరకు ఆగాల్సిందే.