‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మరో భారీ సినిమా ‘సాహో’తో అభిమానుల ముందకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించగా.. యు.వి క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కించింది. ఆగస్ట్ 15న థియేటర్లలోకి తీసుకురావడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సరిగ్గా రిలీజ్‌కు 30 రోజుల ముందు ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో షాకింగ్ విషయాలు బయటపెడుతున్నారు.
త్వరలోనే సినిమా రిలీజ్ అవుతోంది అన్నీ సరే.. అయితే ప్రభాస్‌కు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకున్నారనేది ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. సినిమా మొత్తం రూ. 300 కోట్లతో నిర్మించారు. అయితే తనకు రెమ్యునరేషన్ అని కాకుండా ‘సాహో’ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సగం వాటా పారితోషికం కింద తీసుకుంటారని సమాచారం. అంతేకాదు.. యాక్షన్ సినిమా కావడంతో ఒక్కో సీన్‌కు రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేశారు.
అంటే ప్రభాస్ లెక్క ప్రకారం ఈజీగా రూ. 100 నుంచి 150 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుకుంటారన్న మాట. ఇది పుకార్లు కాకుండా ఇదే కానీ నిజమైతే మాత్రం ఇండియన్ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్స్ పక్కన నిలుస్తాడని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా రిలీజ్‌వరకు వేచి చూడాల్సిందే మరి.