Advertisementt

‘ఇస్మార్ట్ శంకర్’ ఎఫెక్ట్.. నభా గట్టిగానే పెంచేసింది!

Wed 31st Jul 2019 10:33 PM
ismart shankar,nabha natesh,remuneration,tollywood   ‘ఇస్మార్ట్ శంకర్’ ఎఫెక్ట్.. నభా గట్టిగానే పెంచేసింది!
Ismart Shankar Effect.. Nabha natesh Demons High remuneration ‘ఇస్మార్ట్ శంకర్’ ఎఫెక్ట్.. నభా గట్టిగానే పెంచేసింది!
Advertisement
Ads by CJ

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, నభా నటాష్, నిధి అగర్వాల్ నటీనటులుగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. హైదరాబాదీ యాసతో ఎనర్జిటిక్ రామ్ సినిమాను రక్తికట్టించగా.. అందచెందాలతో ఇద్దరు భామలు సినీ ప్రియులను కైపెక్కించారు. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. చాలా రోజుల తర్వాత పూరీ, రామ్ కెరీర్‌లో ఓ మంచి హిట్ సినిమా పడడంతో ఇరువురు ఆనందంలో మునిగితేలుతున్నారు.

అయితే ఇదివరకే ‘నన్ను దోచుకుందువటే’ సినిమా చేసినప్పటికీ నాభాకు ఇంత పేరు రాలేదు. అయితే ఇస్మార్ట్ శంకర్‌తో మాత్రం నభా రేంజ్‌‌ పెరిగిపోయింది. అంతేకాదండోయ్ రేంజ్ పెరిగే కొమ్ములొస్తాయంటారు కదా.. తనకు డిమాండ్ పెరగడంతో రెమ్యునరేషన్ సైతం గట్టిగా పెంచేసింది. కొత్త సినిమాలకు రూ. 25 నుంచి రూ. 40 లక్షల వరకు డిమాండ్ చేస్తోందని టాక్ నడుస్తోంది. 

ఇటీవల.. ఒకరిద్దరు నిర్మాతలు ఈ హాట్ బ్యూటీని సంప్రదించగా రూ. 40 లక్షలకు తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిందట. అంతేకాదు.. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఉన్న కొద్దిసేపటికే తాను గట్టిగా తీసుకున్నానని.. ఇక హీరోయిన్‌గా అయితే రేటు పెంచకుండా ఎందుకుంటానని నిర్మాతలకు చెప్పి పంపిందట. మొత్తానికి చూస్తే ‘ఇస్మార్ట్ శంకర్’ నభాకు మాత్రం బాగానే కలిసొచ్చిందన్న మాట. అయితే ఈ రేంజ్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తీసుకుంటారో లేకుంటే రెడ్ సిగ్నల్‌తో ఇంటికే పరిమితం చేస్తారో వేచి చూడాల్సిందే మరి.

Ismart Shankar Effect.. Nabha natesh Demons High remuneration:

Ismart Shankar Effect.. Nabha natesh Demons High remuneration  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ