Advertisementt

బన్నీ సినిమాతో టాలీవుడ్‌లోకి ‘బ్రదర్ బాబీ’ ఎంట్రీ!

Wed 31st Jul 2019 08:19 PM
allu bobby,allu arjun,tollywood,production  బన్నీ సినిమాతో టాలీవుడ్‌లోకి ‘బ్రదర్ బాబీ’ ఎంట్రీ!
Allu Bobby entry with brother Allu Arjun movie బన్నీ సినిమాతో టాలీవుడ్‌లోకి ‘బ్రదర్ బాబీ’ ఎంట్రీ!
Advertisement
Ads by CJ

ఇదేంటబ్బా.. ఇప్పటికే అల్లువారి ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ ఇద్దరు హీరోలు వచ్చేశారు కదా.. ఇంకెవరున్నారు రావడానికి.. అని అనుకుంటున్నారా..? అదేనండి అల్లు అర్జున్ అన్నయ్య.. అల్లు బాబీ ఉన్నాడు కదా.. ఆయనే సినిమాల్లో నటించాలనే చిరు కోరిక పుట్టిందట. ఈ విషయాన్ని తన బ్రదర్స్, ఫాదర్ చెవిన వేయడంతో బాబీకి తగ్గ పాత్రను చూస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీలోనే బాబీకి కీలకపాత్రను కట్టబెట్టాలనే యోచనలో ఉన్నారట.

కాగా.. అల్లు అరవింద్ పెద్దకుమారుడు బాబీ గురించి ఇండస్ట్రీ అంటే తెలిసిన వారికి తప్ప పెద్దగా ఎవరికీ తెలియదు. ఈయన ఇంత వరకూ ఏ సినిమాలో నటించలేదు. మొదట్నుంచి అల్లు ఫ్యామిలీకి చెందిన గీతా ఆర్ట్స్‌కు సంబంధించిన నిర్మాణ పరమైన వ్యవహారాలు చూస్తున్నాడు.

అయితే రెండో పెళ్లి జరిగిన తర్వాత ఉన్నట్టుండి సినిమాలో నటించాలని.. తెరపై కనిపించాలనే ఆసక్తి పెరిగిందట. అందుకే ఎలాగైనా సరే తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకొని నటించాలని ఫిక్స్ అయ్యాడట. అలాగనీ నిర్మాణ పనులు మాత్రం పక్కనెట్టనని.. అటు ఇటూ రెండూ చూసుకుంటాననని తండ్రితో చెప్పాడట. దీంతో ఆయన బన్నీ సినిమా డైరెక్టర్‌తో పాటు పలువురు దర్శకనిర్మాతల దగ్గర అల్లు అరవింద్ ఖర్చీప్ వేసి పెట్టారట. అయితే తెరపై కనిపించాలన్న బాబీ కోరిక తీరుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Allu Bobby entry with brother Allu Arjun movie:

Allu Bobby entry with brother Allu Arjun movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ