తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-3 కి 15 మంది కంటెస్టెంట్లను నిర్వాహకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఒక్కొక్కర్ని ఒక్కో విధంగా పారితోషికం ఇచ్చుకున్నారట. ముఖ్యంగా అటు బుల్లితెర.. ఇటు వెండితెరపై తన అంద చెందాలతో కుర్రకారును కైపెక్కించిన శ్రీముఖికి మాత్రం అందరికంటే గట్టిగానే ఇచ్చుకున్నారని టాక్ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంత భారీ పారితోషికం ఇవ్వడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయట.
ఒక్కోరోజుకు శ్రీముఖికి ఏకంగా రూ. 3.5 లక్షలు ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం వంద రోజులుండి ఫైనల్‌వరకు వెళితే రూ. 3.5 కోట్ల పారితోషికం పుచ్చుకుంటుందన్న మాట. ఈ లెక్కన ఇంచుమించు దక్షిణాది హీరోయిన్లు కూడా ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ కంటే రెండు రెట్లు ఎక్కువేనన్న మాట. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
వాస్తవానికి శ్రీముఖి ఒక్క ‘పటాస్’షో కాకుండా బయట వేరే ప్రోగ్రామ్స్‌కు వెళ్లినా గట్టిగానే డబ్బులొస్తాయ్..ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే షోకు వెళితే మరింత పేరొస్తుందని మాత్రమే భావించిందట. అంతేకాదు పవన్ అభిమానులు తనను ఓట్లేసి గెలిపిస్తారనే ఒక నమ్మకంతో కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందట. అయితే పవన్ అభిమానులు శ్రీముఖిని ఏ మాత్రం ఆదరిస్తారో వేచి చూడాల్సిందే మరి.