Advertisement
TDP Ads

చిరు-కొరటాల మూవీలో హీరోయిన్ ఈ భామేనా!

Wed 31st Jul 2019 07:37 PM
chiru,koratala movie,kajal aggarwal,mega star  చిరు-కొరటాల మూవీలో హీరోయిన్ ఈ భామేనా!
Heroine Fixed for Chiru - Koratala Movie? చిరు-కొరటాల మూవీలో హీరోయిన్ ఈ భామేనా!
Advertisement

‘సైరా’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వినడం.. ఓకే చెప్పడం అన్నీ అయిపోయాయి. ఇక షూటింగ్ షురూ చేయడం ఒక్కటే ఆలస్యం. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్‌ వస్తున్నాయని ఎప్పట్నుంచో పుకార్లు వచ్చిన విషయం విదితమే. 

అయితే ఈ రెండు పాత్రలకు గాను చిరు సరసన నయనతార, అనుష్కను తీసుకుంటారని వార్తలు వచ్చాయి. తాజాగా టాలీవుడ్‌లో పదేళ్లుగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పయనిస్తున్న కాజల్ అగర్వాల్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే చిరు సరసన ‘ఖైదీ నెం:150’ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ భామను కొరటాల కూడా ఫిక్స్ చేసేశారట. కొత్తోళ్లను వెతికి సెట్ కాకపోతే బాగోదని భావించిన ఆయన.. ఆల్రెడీ చిరుతో నటించిన వారయితే బెటర్ అని భావిస్తున్నాడట.

అంతేకాదు.. చిరు సరసన నటించడానికి ఖైదీ సినిమాతో పోలిస్తే ఈ చిత్రానికి గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్. అయితే రెమ్యునరేషన్ ఎంతైనా సరే కచ్చితంగా కాజల్‌నే తీసుకోవాలని దర్శక, నిర్మాతలు యోచిస్తున్నారట. ఈ వ్యవహారంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా చిరు కొత్త సినిమా అంటే పుకార్లకు కొదువ ఉండదన్న విషయం విదితమే.

Heroine Fixed for Chiru - Koratala Movie?:

Heroine Fixed for Chiru - Koratala Movie?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement