Advertisementt

YVS చౌదరి చేతుల్లో ‘సంశయం’ ట్రైలర్

Wed 31st Jul 2019 01:29 AM
yvs chowdary,samsayam,trailer,release  YVS చౌదరి చేతుల్లో ‘సంశయం’ ట్రైలర్
Samsayam Movie Trailer Released YVS చౌదరి చేతుల్లో ‘సంశయం’ ట్రైలర్
Advertisement
Ads by CJ

‘తాగుబోతు’ రమేష్, అనిరుద్ కస్తూరి, దివ్య ప్రధాన పాత్రల్లో, మహేష్ చెంగారెడ్డి దర్శకుడిగా, నిర్మిస్తున్న చిత్రం ‘సంశయం’. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శక, నిర్మాత YVS చౌదరి గారు లాంచ్ చేసారు. ఈ సందర్బంగా YVS గారు మాట్లాడుతూ, ‘సంశయం’ ఒక మంచి తెలుగు టైటిల్‌తో డైరెక్టర్‌గా పరిచయమవుతున్న మహేష్ చెంగారెడ్డి నాకు మంచి ఫ్రెండ్. ఇద్దరం చెన్నయ్‌లో రూమ్ మేట్స్. ఆ టైంలో మా మధ్య ఎక్కువగా సినిమాల గురించి డిస్కషన్ జరిగేది. ఆ డిస్కషన్‌లో మహేష్ చాలా జన్యున్ రీజన్స్ చెప్తూ, తన ఐడియాస్‌ని షేర్ చేసుకునేవాడు. 

ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్వశ్చన్స్ రేజ్ చేస్తూ మాకు బాగా హెల్ప్ అయ్యేవాడు. అలాంటి మహేష్ ‘సంశయం’ అనే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో, మన రెగ్యులర్ లైఫ్ లో కనిపించే క్యారెక్టర్స్ ని సినిమాలో చూపించబోతున్నాడు. చాలా హ్యాపీగా  ఫీల్ అవుతున్నాను. ట్రైలర్‌లోనే ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసి, తను సినిమాలో ఏం చెప్పబోతున్నాడో చాలా క్లారిటీగా ఉన్నాడనిపించింది. NRI’S ని ఆర్టిస్టులుగా పెట్టుకుని, వాళ్ళచేత ఇంత మంచి పెర్ఫార్మన్స్ ని రాబట్టుకొని, చాలా బాగా ఆర్గనైస్ చేసాడు. 

గొప్ప విషయం ఏంటంటే... ఇందులో ఆర్టిస్ట్‌లు అందరూ జాబ్స్ చేసేవాళ్ళే, వాళ్ళతో ఓన్లీ వీకెండ్స్‌లో షూట్ చేస్తూ ఈ మూవీని కంప్లీట్ చేసాడంటే మహేష్‌కి సినిమా మీద ఎంత ఫ్యాషన్ ఉందో తెలుస్తుంది. I WISH ALL THE BEST TO ENTIRE TEAM. సినిమా మంచి సక్సెస్ అయ్యి, మహేష్ డ్రీం వర్క్స్ బ్యానర్ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం- కళ్యాణ్ కాదిన్, ప్రమోద్ పులిగిళ్ళ, pvrరాజ, PRO -మధు విఆర్, ఎడిటర్: సన్నీ అట్లూరి, స్క్రీన్ ప్లే- సతీష్ బాణాల, సినిమాటోగ్రాపర్: సర్ హెన్రీ చాంగ్, కథ-మాటలు-దర్శకత్వం- మహేష్ చెంగారెడ్డి. 

Samsayam Movie Trailer Released:

YVS Chowdary Releases Samsayam Trailer