ఈ శుక్రవారం నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ అందులో రెండింటి మధ్యే పోటీ. బెల్లంకొండ శ్రీనివాస్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న చిత్రం రాక్షసుడు. ఈ చిత్రం తమిళ చిత్ర రీమేక్‌గా వస్తుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు మేకర్స్. ఆల్రెడీ ఈ సినిమాను తమిళంలో చాలామంది తెలుగు ప్రేక్షకులు చూసేసారు. అయినా కానీ తెలుగులో ఎలా తీశారో అని చూడనున్నారు. ఇది థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ.
ఇక దీనితో పాటు మరో యాక్షన్ ఎంటర్టైనర్ రానుంది. అదే గుణ 369. RX 100తో సెన్సేషనల్ హిట్టూ.. హిప్పీతో డిజాస్టర్ రెండూ టేస్ట్ చేసిన కార్తికేయకు దీని సక్సెస్ చాలా అవసరం. బోయపాటి శిష్యుడు ఈసినిమాను డైరెక్ట్ చేసాడు. ట్రైలర్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రామిసింగ్‌గా అనిపించడం యూనిట్‌కి రిలీఫ్ కలిగిస్తోంది. ఈ రెండు సినిమాలకి ఒక గోల్డెన్ ఛాన్స్ ఉంది.
ఆల్రెడీ చాలా చోట్ల ఇస్మార్ట్ శంకర్ రన్ ముగిసిపోయింది. అలానే డియర్ కామ్రేడ్ నాలుగో రోజుకే వీకవ్వడం బయ్యర్లకు గుబులు పుట్టిస్తోంది. స్లో గా రన్ అవుతుంది. సో ఈ నేపధ్యంలో రాక్షసుడు-గుణ 369 కనక కంటెంట్‌తో మెప్పిస్తే వీక్ ఎండ్‌తో పాటు మన్మథుడు 2 వచ్చే వరకు టికెట్ కౌంటర్లను దున్నేయొచ్చు. చూద్దాం ఈ రెండు సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో..