ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో ఫ్యాన్స్ పై ఆరోపణలు, దాడులు చేయడం కామన్ అయిపోయింది. అయితే తమిళంలో ఇది కొంచం ఎక్కువ అయిందనే చెప్పాలి. తమిళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఇళయదళపతి విజయ్ ఫ్యాన్స్ కి, తాలా అజిత్ ఫ్యాన్స్ కి అసలు అంటే అసలు పడదు. ఇద్దరి ఫ్యాన్స్ ఒక్కరి పై ఒక్కరు ఆరోపణలు చేసుకుంటూ హద్దులు కూడా దాటిన సందర్భాలు ఉన్నాయి.
అయితే అజిత్ ఫ్యాన్స్ ఏకంగా ఒక అడుగు ముందుకేసి యాక్టర్ విజయ్ మరణించారంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాష్ టాగ్ విజయ్ రిప్ అని న్యూస్ ని స్ప్రెడ్ చేసారు. అసలు ఇంతలా చేయడానికి కారణం ఏంటో మాత్రం తెలియదు. ప్రస్తుతం ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా అజిత్ ఫ్యాన్స్ చేయడం వల్ల ఈ పనికి సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఇద్దరి హీరోస్ కూడా తమ ఫ్యాన్స్‌కి ఎప్పుడో వార్నింగ్‌లు కూడా పంపించారు. అజిత్ అయితే అలా చేసే వాళ్లు నాకు అభిమానులే కాదంటూ చాలా సందర్భాల్లో గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. మరి ఈ ప్రచారంపై ఇద్దరు హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో వెయిట్ అండ్ సీ..