దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో చేసే నటీనటుల పాత్రలు ఎంత బలంగా వుంటాయో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ సినిమాల్లో హీరో హీరోయిన్స్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో... హీరోయిన్ తండ్రి, తల్లి, హీరో తల్లి, తండ్రి పాత్రలకు అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక త్రివిక్రమ్ సినిమాల్లో నటుడు రావు రమేష్ కేరెక్టర్స్ ని చాలా బలంగా చూపిస్తాడు. రావు రమేష్‌కి మంచి పాత్రలిస్తాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ తెరకెక్కించిన చాలా సినిమాల్లో రావు రమేష్‌కి మంచి కేరెక్టర్స్ దొరికాయి. అయితే అలాంటి త్రివిక్రమ్ సినిమా నుండి తాజాగా రావు రమేష్ తప్పుకున్నాడనే విషయం ఇప్పుడు అందరిని షాక్ కి గురిచేస్తుంది. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కోసం రావు రమేష్ రెండు నెలల కాల్షీట్స్ కూడా ఇచ్చాడు. ఈ సినిమాలో రావు రమేష్ కి మంచి పాత్ర పడిందని చిత్ర బృందం చెప్పినమాట.
అయితే తాజాగా రావు రమేష్ మరో అద్భుతమైన ఆఫర్ రావడంతో త్రివిక్రమ్ - అల్లు అర్జున్ సినిమా నుండి బయటికెళ్లినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అల్లు అర్జున్ సినిమాని వదులుకుని రావు రమేష్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి పిలుపు రాగానే మహేష్ చెంతకు చేరాడని టాక్ ఫిలింసర్కిల్స్‌లో వినబడుతుంది. అనిల్ రావిపూడి - మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో రావు రమేష్‌కి మంచి పాత్ర వచ్చిందట. ఇక దానికోసమే అంటే మహేష్ సినిమా కోసం రావు రమేష్.. అల్లు అర్జున్ సినిమా నుండి బయటికొచ్చేసాడని టాక్. ఇక త్రివిక్రమ్ కూడా రావు రమేష్ బయటికెళ్ళగానే ఆ పాత్ర కోసం నటుడు, రచయిత అయిన హర్షవర్ధన్‌ని తీసుకున్నట్లుగా సమాచారం.