ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని మెజార్టీ సీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చాక పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారు. మరీముఖ్యంగా టాలీవుడ్ నుంచి పార్టీలోకి వచ్చి సేవలు చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్‌కు ఇప్పటికే ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడమైనది.
ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన పార్టీలను కాదని వైసీపీ తీర్థం పుచ్చుకున్న కమెడియన్ అలీకి కూడా న్యాయం చేయాలని జగన్ యోచిస్తున్నారట. వాస్తవానికి అలీ.. ఎమ్మెల్యే టికెట్ ఆశించారు అది కుదరకపోవడంతో చివరికి ఎమ్మెల్సీ ఇచ్చి వక్ఫ్ బోర్డు నియమిస్తారని దీంతో ఆయన ‘డబుల్ ధమాకా’ ఇచ్చినట్లుందని పార్టీ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా.. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర నాటక మండలి (ఏపీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా నియమించేశారని తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో రెండ్రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో..? తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే మరి.