టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజుతో సినిమాలు చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి? దిల్‌రాజు బ్యానర్‌లో ఒక్క సినిమా అయినా చేయాలనీ చాలామంది డైరెక్టర్స్ అండ్ హీరోస్ అనుకుంటారు. రీసెంట్‌గా మహేష్ బాబు తన ప్రమోషన్ స్కిల్స్ నచ్చి సరిలేరు నీకెవ్వరు సినిమాలో దిల్‌రాజును యాడ్ చేసారు.
కానీ ఓ యంగ్ హీరో మాత్రం దిల్‌రాజు సినిమా అంటే దూరంగా ఉంటున్నాడట. ఆయన ఎవరో కాదు విజయ్ దేవరకొండ. ఎస్ విజయ్‌తో దిల్‌రాజు ఓ సినిమా చేయాలనీ చాలా ట్రై చేస్తున్నాడు. గత కొన్ని వారాల నుండి ట్రై చేస్తున్నా విజయ్ మాత్రం ఎస్ అనీ చెప్పకుండా, నో అనీ చెప్పకుండా వున్నట్లు తెలుస్తోంది.
అలానే ఓ డైరెక్టర్ కూడా దిల్‌రాజు కాంబినేషన్ విజయ్‌తో ఓ సినిమా చేయాలనీ చూస్తున్నాడు. అయితే దిల్‌రాజు తో కాకుండా బయట నిర్మాతలతో చేస్తే విజయ్ డేట్స్ దొరుకుతాయి అని ఆ డైరక్టర్‌కు సలహాలు అందుతున్నట్లు తెలుస్తోంది. మరి అసలు విజయ్ ఎందుకు దిల్‌రాజుతో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదో అర్ధం కావడంలేదు.