భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ మొదటి షో నుండి డివైడ్ టాక్‌తో రన్ అయింది. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ బట్టి ఇది యావరేజ్ సినిమా అని అర్ధం అయిపోయింది. అమెరికాలో ఈ సినిమాని గీత గోవిందం కలెక్షన్స్ చూసి అదే రేంజ్ లో ఈ మూవీకి కూడా వస్తాయి అని భావించి యుఎస్ డిస్ట్రిబ్యూటర్ దీనిని భారీ ఆఫర్ ఇచ్చి కొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అమెరికాలో తొలి వీకెండ్ ముగిసేసరికి మిలియన్ మార్క్ కూడా చేరుకోలేదు. ఇవాళ్టి నుండి వీక్ డేస్ స్టార్ట్ అవుతాయి కానుక కచ్చితంగా డ్రాప్ ఉండే అవకాశముంది. అంటే ఓవరాల్‌గా ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌కి నష్టం తప్పేలా లేదు. అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏమి అంత గొప్పగా లేవు కలెక్షన్స్.
సినిమా యూనిట్ చెపుకుంటున్నటు బ్లాక్ బస్టర్ అయితే కాదు అని కలెక్షన్స్ చూస్తే అర్ధం అవుతుంది. వీకెండ్‌లో ఓ మాదిరిగా వచ్చాయి కానీ అసలైన ఛాలెంజ్ ఇవాళ్టి నుంచి ఉంది. ఇక కన్నడ - మలయాళం వెర్షన్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రింట్ ఖర్చులు కూడా వస్తాయా? అన్న అనుమానాలు అయితే ఉన్నాయి.