బాలకృష్ణ - కెఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా సోనాల్ చౌహాన్ ఫైనల్ అయింది. అలానే మరో హీరోయిన్‌గా సుమంత్ హీరోగా నటించిన ‘దగ్గరగా దూరంగా’ ఫేమ్ వేదిక కూడా ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు సమాచారం.
ఇక తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణతో నటించినడానికి ఒక హాట్ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు నమిత. గతంలో ఈమె బాలయ్యతో సింహా సినిమాలో నటించింది. అయితే రవికుమార్ సినిమాలో నమిత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనుందట.
మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సిఉంది. ఇక ఈ సినిమాపై బాలయ్య అంచనాలు పెంచుకున్నాడు. ఇది ఎట్టిపరిస్థితుల్లో హిట్ అవ్వాలని చూస్తున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీ సంక్రాంతి రేస్ నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి.