Advertisementt

RRR‌కు మరో షాక్.. అయ్యో ఎందుకిలా!?

Mon 29th Jul 2019 07:34 PM
rrr updates,ram charan,rajamouli,jr ntr  RRR‌కు మరో షాక్.. అయ్యో ఎందుకిలా!?
Another Shock To RRR.. Here Why reason RRR‌కు మరో షాక్.. అయ్యో ఎందుకిలా!?
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్షించిన దర్శకధీరుడు తాజాగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు నటిస్తున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారా..? అనేదానిపై ఇప్పటికీ అర్థం కావట్లేదు.. సస్పెన్షన్‌కు శుభంకార్డు మాత్రం పడ్లేదు.

ఎన్టీఆర్‌కు జోడీగా మొదట బ్రిట‌న్ భామ డైసీ ఎడ్గర్గ్ జోన్స్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆ భామ తప్పుకుంది. దీంతో జక్కన్నకు షాక్ తగిలినంతపనైంది. అయితే తాజాగా.. అమెరిక‌న్ న‌టి, సింగ‌ర్ ఎమ్మా రొబ‌ర్ట్స్‌ను రాజమౌళి ఎంపిక చేసుకున్నార‌ని పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి. దీంతో హమ్మయ్యా హీరోయిన్ దొరికేసిందని చిత్రబృందం.. మరోవైపు తమ అభిమాన నటుడికి హీరోయిన్ దొరికిందోచ్‌ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలారు. అయితే ఆ ఆనందం పట్టుమని పది రోజులు కూడా లేకుండా పోయింది.

ఎక్కువ రోజులపాటు షూటింగ్‌లో పాల్గొనలేనని.. అన్ని రోజులు తేదీలు ఇవ్వలేనని తేల్చిచెప్పిన ఎమ్మా రాబర్ట్స్‌ RRR నుంచి తప్పుకుంటున్నట్లు తేల్చిచెప్పిందట. దీంతో జక్కన్నకు మరో ఊహించని షాక్ తగిలింది. ఇలా అందరూ వరుసగా తప్పుకుంటుడంతో అయ్యో.. RRR కే ఎందుకిలా జరుగుతోందని చిత్రబృందం ఆలోచనలో పడిందట. అయితే మరో ఇంగ్లిష్ భామ కోసం జక్కన్న వేట మొదలుపెట్టారని టాక్ నడుస్తోంది. మరి ఈసారైనా ఎన్టీఆర్‌కు జోడీ సెట్ అవుతుందా..? లేదా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Another Shock To RRR.. Here Why reason:

Another Shock To RRR.. Here is the Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ