‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు ప్రేక్షకుల ఊహల్లో నిలిచి.. తన కొంటె చూపులతో కైపెక్కించి ‘జోరు’ పెంచి.. అందచెందాలతో ‘జిల్’ జిగేలుమనిపించిన ఈ ‘బెంగాల్ టైగర్’ భామ రాశీఖన్నా కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపింది. అయితే ఈ మధ్య కాలంలో అవకాశాలు రాక నాలుగు గోడలకే పరిమితం అయ్యింది. ఒకానొక సందర్భంలో బాగా అప్‌సెట్ అయిన ఈ భామ చివరగా ‘జైలవకుశ’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆశించినంతగా సినిమాలు రాకపోవడం.. వచ్చినా అడపాదడపా హిట్‌లే.
అయితే పైన చెప్పిందంతా ఒకప్పుడు.. ఇప్పుడిక రాశీకి మంచిరోజులోజులొచ్చేశాయ్. వాస్తవానికి ఇప్పటి వరకూ చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేసిన ఈ సొట్టబుగ్గల భామకు స్టార్ల సరసన నటించే అవకాశం రాలేదు. తాజాగా ఆ కోరిక కూడా రాశీకి తీరిపోయింది.. లెక్కలు పూర్తిగా మారిపోయాయ్. ఇందుకు కారణం తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ సరసన హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. అంతేకాదండోయ్.. తమిళ స్టార్ హీరోలల్లో ఒకరైన విజయ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
ఇద్దరూ పెద్ద హీరోలే కావడం.. సినిమాలు కూడా పెద్దవే కావడంతో రాశీ.. పొలంలో మొలకులొచ్చినట్లైంది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకూ ఈ ముద్దులగుమ్మకు మినిమమ్ గ్యారంటీ లేకపోగా.. తాజాగా ఈ రెండు సినిమాల్లో అవకాశం రావడంతో ఆనందంతో మునిగితేలుతోందట. ఇక రాశీఖన్నా పరుగులు పెట్టడం ఒక్కటే మిగిలుందన్న మాట.