తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 హౌస్ నుంచి ఫస్ట్ వికెట్ డౌన్ అయ్యింది. మొత్తం 15మంది కంటెస్టెంట్లలో సీనియర్ నటి కమ్ కమెడియన్ హేమ ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో మొత్తం ఆరుగురు హేమ, జాఫర్, హిమజ, పునర్నవి, వితిక, రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేషన్‌లో ఉన్నారు. అయితే హేమ అందర్నీ కలుపుకుని మంచిగా ఉన్నారని.. చివరి వరకు హౌస్‌లో ఉంటారని అందరూ భావించారు కానీ ఫస్ట్ ఎలిమినేట్ ఈమే కావడం గమనార్హం.
ఇదిలా ఉంటే హేమ ఎలిమినేట్ అవ్వగా మిగతా ఐదుగురు ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో పడ్డారు. ఈ ఐదు రోజులపాటు ఈ ఆరుగురు ఎలిమినేషన్ భయం భయంగా గడిపారని చెప్పుకోవచ్చు. మొదట శనివారం నాడు టీవీ ద్వారా కంటెస్టెంట్లను పలకరించిన హోస్ట్ అక్కినేని నాగార్జున.. నామినేట్ అయిన ఆరుగురిలో ఇద్దరిని సేఫ్ జోన్‌లో వేశారు. ఆ ఇద్దరు హిమజ, పునర్నవి కావడంతో ఊపిరిపీల్చుకున్నారు.
ఇక ఫైనల్‌గా ఆదివారం వచ్చేసరికి హేమను బయటికి పంపించేశారు. ఈ సందర్భంగా హేమను నాగ్ ఒకే ఒక్క ప్రశ్న అడిగారు. ప్రస్తుతం హౌస్‌లో ఎవరు విన్నింగ్..? ఎవరు కన్నింగ్..? చెప్పండని అడిగారు. ఇందుకు హేమ బదులిస్తూ విన్నర్‌లు శ్రీముఖి, బాబా భాస్కర్ అని... కన్నింగ్‌లు అయితే ఎవరూ లేరని అంతా మంచి వాళ్లే అని కంటెస్టెంట్లందరికీ హేమ్ గుడ్ మార్క్క్ వేశారు. చివరగా కంటెస్టెంట్లకు చిన్నపాటి సలహాలు, సూచనలు చేసిన హేమ హౌస్ నుంచి బయటికొచ్చేశారు.