షకలక శంకర్ కథానాయకుడిగా, రీతూ భర్మెచా కథానాయకురాలుగా ‘ది వన్ ఎంటర్ టైన్మెంట్స్’ బ్యానర్ పై ఎం.యస్. రెడ్డి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తోన్న చిత్రం “ఆత్రేయపురం ఆణిముత్యం” పూజా కార్ర్యక్రమాలు లాంఛనంగా ఫిల్మ్ నగర్ రామానాయుడు స్టూడియోలో ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత కె.ఎల్ దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టగా, సీనియర్ డైరెక్టర్ సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. పి. సత్యా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో షకలక శంకర్ మాట్లాడుతూ...“ఆత్రేయపురం ఆణిముత్యం నా మార్క్ కామెడీ చిత్రం. ఎమ్మెస్ రెడ్డిగారు మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కచ్చితంగా అందర్నీ ఎంటర్ టైన్ చేస్తుంది’’ అన్నారు.
చిత్ర దర్శక నిర్మాత ఎం.యస్. రెడ్డి మాట్లాడుతూ... ‘‘ఆత్రేయపురంలో రాజు అనే యువకుడి చుట్టూ తిరిగే కుటుంబ హాస్య చిత్రం ఇది. సమాజంలో జరిగే ఉమెన్ హరాష్‌మెంట్ గురించి చర్చిస్తున్నాం. ఆత్రేయపురం పరిసర ప్రాంతంలో మరియు హైదరాబాద్ లో చిత్రీకరించబోతున్నాం. ఈ కాన్సెప్ట్ కు షకలక శంకర్ గారైతే పర్ఫెక్ట్ యాప్ట్ అని ఆయన్ను తీసుకున్నాం. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ‘మా ఆత్రేయపురం ఆణిముత్యం’ అందర్నీ అలరిస్తాడు’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వెంగి, డియస్ రావు, రీతూ భర్మెచా తదితరులు పాల్గొన్నారు.
తారాగణం : షకలక శంకర్, రీతూ భర్మెచా, ఇంద్రజ, తులసి, కాశీ విశ్వనాథ్, DS రావు, BHEL ప్రసాద్, పటాస్ నూకరాజు, మహిపాల్
టెక్నిషీయన్స్ : ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్ ; DOP – రవి ; మ్యూజిక్ – వెంగి; స్టిల్స్ – శ్రీను విల్లా ; ఆర్ట్ – వర్మ; పబ్లిసిటీ డిజైనర్: వివా రెడ్డి; నిర్మాత-దర్శకుడు: ఎం.యస్.రెడ్డి.