Advertisementt

బాలయ్య కొడుకు హీరో మెటీరియల్ కాదట!

Mon 29th Jul 2019 12:05 PM
balakrishna,son,mokshagna,not hero,material  బాలయ్య కొడుకు హీరో మెటీరియల్ కాదట!
Mokshagna Not a Hero Material బాలయ్య కొడుకు హీరో మెటీరియల్ కాదట!
Advertisement
Ads by CJ

నందమూరి హీరో బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయడానికి భగీరథ ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదిగో అప్పుడొస్తున్నాడు.. ఇప్పుడొస్తున్నాడు అని అంటున్నారే తప్ప ఇంతవరకూ ఎంట్రీ ఇవ్వలేదు. అసలు ఎంట్రీ ఉంటుందా లేదా అని నందమూరి అభిమానులకు అర్థం కాని పరిస్థితి. ఈ వ్యవహారంపై ఇప్పటికే బాలయ్య రియాక్ట్ అవుతూ టైం వచ్చినప్పుడు అన్నీ తనకు తెలుసని బాలయ్య చెప్పి సైలెంటయ్యారు.

సరిగ్గా ఇదే సమయంలో మోక్షజ్ఞను విదేశాలకు పంపారని అక్కడే శిక్షణ, బాడీ బిల్డప్ చేస్తున్నారని టాక్ వచ్చింది. అంతేకాదు విదేశాల నుంచే సినిమా స్టార్ట్ అవుతుందని కూడా వార్తలు వినవచ్చాయి. ఇవన్నీ జరిగింది ఎప్పుడో. అయితే తాజాగా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న మోక్షజ్ఞ ఫొటోలను చూసిన నందమూరి ఫ్యాన్స్ కంగుతిన్నారట. వామ్మో మోక్షజ్ఞ ఏంటి ఇలా ఉన్నాడు? ఇంతవరకూ ట్రైనింగ్ అన్నారు. అన్నీ చేసినా ఇలా ఉన్నారా..? అసలే ట్రైనింగ్ తీసుకోలేదా..? అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మరోవైపు ఈ ఫొటోలపై నెటిజన్లు విమర్శకులు, నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అసలు హీరో అయ్యే ఆలోచన ఉందా?.. లేదా? అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మోక్షజ్ఞ హీరో మెటీరియల్ కాదు..? ఆయనలో హీరో కావాలనే కసి లేదు..? రేపో మాపో హీరో కావాల్సినోడు ఇలా ఉన్నాడేంటి..? అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కామెంట్స్ చూసిన బాలయ్య వీరాభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. అయితే ఫైనల్‌గా ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టి మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగుపెట్లే ఆలోచన ఉందా..? లేదా అన్నది తెలియాలంటే బాలయ్య లేదా చినబాబు రియాక్ట్ అవ్వాల్సిందే మరి.

Mokshagna Not a Hero Material:

Trolling on Mokshagna in Social Media 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ