Advertisementt

రియల్‌ లైఫ్‌లో ‘బిజినెస్‌మెన్’గా వస్తున్న మహేశ్!

Mon 29th Jul 2019 01:24 AM
mahesh babu,expanding,business,horizons  రియల్‌ లైఫ్‌లో ‘బిజినెస్‌మెన్’గా వస్తున్న మహేశ్!
Mahesh Expanding Business Horizons రియల్‌ లైఫ్‌లో ‘బిజినెస్‌మెన్’గా వస్తున్న మహేశ్!
Advertisement
Ads by CJ

ఇదేంటి సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘బిజినెస్‌మెన్’ సినిమా వచ్చేసింది కదా.. మళ్లీ ఇప్పుడేంటి అని అనుకుంటున్నారా..! అదేనండి అది రీల్‌లో.. ఇప్పుడు రియల్‌ ‘బిజినెస్‌మెన్’ గా వచ్చేస్తున్నారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందాన్ని చక్కగా ఫాలో అవుతారన్న విషయం విదితమే. ఇప్పటికే పలువురు నటీనటులు ఓ వైపు చేతిలో అవకాశాలుండగానే బిజినెస్‌లు చేసి రిచ్‌గా సెటిలైపోయారు. అయితే ఇప్పుడు అదే బాటలోనే మహేశ్ కూడా నడుస్తున్నారు.

ఇప్పటికే ‘ఏఎంబీ సినిమాస్’ పేరుతో మల్టీ ఫ్లెక్స్ సముదాయం నిర్మించగా.. తాజాగా మరో కొత్తరంగంలోకి బాబు అడుగుపెడుతున్నట్లు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. మిమ్మల్ని ఉత్సుకతకు గురిచేసే విషయాన్ని పంచుకుంటున్నామని.. ప్రస్తుతం మేం దీని పనిలోనే ఉన్నామని.. సీక్రెట్‌ను బయటపెట్టేందుకు ఈ లింక్‌ను క్లిక్‌ చేయండంటూ ఓ వెబ్‌సైట్‌ను మహేశ్ టీమ్ పోస్ట్ చేసింది. కాగా ఈ ట్వీట్‌ను మహేశ్ రీ ట్వీట్ చేయగా.. అభిమానులంతా పెద్ద ఎత్తున షేర్ చేసి.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా.. ఈ లింక్‌లో మూడ్రోజులు కౌంట్‌డౌన్‌ ఉంచడం జరిగింది. దీన్ని ఓపెన్ చేయగానే డ్రెస్ కలర్స్, దుస్తుల రకాలు, బ్రాండ్‌లు ఉంచారు. మొత్తానికి చూస్తే.. మరో మూడు రోజుల్లో ఆన్‌లైన్‌ షాపింగ్ వెబ్‌సైట్ ప్రారంభం కాబోతుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి. ఇదిలా ఉంటే ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్-చార్మీలు సంయుక్తంగా ఇదే బిజినెస్‌లోకి దిగిన సంగతి తెలిసిందే.

Mahesh Expanding Business Horizons:

Mahesh Babu Into Apparel Business

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ