సాయి పల్లవికి.. పాత్ర, ఆ పాత్ర తీరు నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటుందని, ఆమె లిప్ లాక్ కిస్సులకి, గ్లామర్ పాత్రలకి దూరమని తెలుసు. రొమాంటిక్ సన్నివేశాల్లో జీవించే సాయి పల్లవి లిప్ లాక్ కిస్సులకు మాత్రం నో చెప్పేస్తుంది. అలానే విజయ్ దేవరకొండ లాంటి క్రేజ్ ఉన్న హీరో సినిమాలో నటించమంటే నో చెప్పేసింది. విజయ్ దేవరకొండ సినిమాలంటే లిప్ లాక్స్ కంపల్సరీ అన్న రేంజ్లో విజయ్ సినిమాలు ఉంటున్నాయి. విజయ్ దేవరకొండ తాజా సినిమా డియర్ కామ్రేడ్ లో ముందు హీరోయిన్‌గా అవకాశమొచ్చింది సాయిపల్లవికే. తర్వాత సాయి పల్లవి కాదంటేనే ఆ పాత్ర రష్మికాని వరించింది. డియర్ కామ్రేడ్ సినిమా మొత్తం రష్మిక చేసిన లిల్లీ పాత్ర చుట్టూతానే తిరుగుతుంది. సినిమా మొత్తం రష్మికనే కనబడుతుంది. అలాంటి ప్రాధాన్యమున్న పాత్రని సాయి పల్లవి కేవలం లిప్ లాక్ సన్నివేశాల కోసం కాదనుకుందా? అని ఒక టైం లో అనిపించకమానదు.
డియర్ కామ్రేడ్ లో హీరోయిన్ పాత్రకి అంత ఇంపార్టెన్స్ ఉంది. దర్శకుడు ముందే హీరోయిన్ కి ప్రాధాన్యమిస్తూ ఈ సినిమా కథ రాసుకున్నాడు. కానీ సాయి పల్లవి మాత్రం తన పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉందని చెప్పినా ఒప్పుకోలేదు అయితే సినిమాకొచ్చిన టాక్ తో ఇప్పుడు సాయి పల్లవి సంతోషపడుతుందా..? కానీ సినిమాకొచ్చిన టాక్ కి సినిమాకొచ్చిన మొదటి రోజు కలెక్షన్స్ కి పొంతనే లేదు. మరి విజయ్ దేవరకొండ - రష్మిక తమ తదుపరి సినిమా షూటింగ్స్ ని పక్కనబెట్టి మరీ ఈ సినిమా ప్రమోషన్స్‌ని గట్టిగా చేశారు.
అందుకే విజయ్ క్రేజ్, ప్రమోషన్స్‌తోనే సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మరి విజయ్ దేవరకొండతో సాయి పల్లవి కలిసి ఉంటే గనక సినిమాకి మరికొంత క్రేజ్ యాడ్ అయ్యేదనేది నిజం. ఇక రష్మికతో విజయ్ రెండోసారి చెయ్యడము ప్లస్సే. గీత గోవిందంతో విజయ్ - రష్మికల జంట అంతగా పాపులర్ అయ్యారు. మరి డియర్ కామ్రేడ్ సినిమాని వద్దనుకున్న సాయి పల్లవి డెసిషన్ రాంగా.. రైటా అనేది డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ డిసైడ్ చేస్తాయి.