విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 2’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ ఫన్ అండ్ ప్రస్టేషన్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఈ సినిమాలో పేరుకు తగ్గట్టుగానే కామెడీ పండింది.. సినిమా చూసిన జనాలు కడుపుబ్బా నవ్వుకుని బయటికొచ్చారు. అయితే అప్పుడు ఓన్లీ ఎఫ్-2 అంతే ఇప్పుడిక అంతకుమించి నవ్వించడానికి మరోసారి వెంకీ వచ్చేస్తున్నాడు.
అయితే ఈ సారి వరుణ్ తేజ్‌కు బదులుగా తన మేనల్లుడు నాగచైతన్యను వెంకీ పట్టుకొస్తున్నారట. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో చేయబోయే సినిమాకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘వెంకీ మామ’ షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎఫ్2కు మించి కామెడీతో ‘ఫుల్’గా నవ్వించేస్తారట.
కాగా త్రినాథరావ్ తెరకెక్కించిన ‘సినిమా చూపిస్తా మామ’.. ‘నేను లోకల్’ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే వెంకీతో తీయబోయే ఈ సినిమాలో కామెడీ పండి బాక్సాఫీస్‌ను షేక్ చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందా..? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.