Advertisementt

కథ సిద్ధం.. యాంగ్రీస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా!!

Sat 27th Jul 2019 07:18 PM
script,angry star rajasekhar,tollywood,veerabhadram chowdary  కథ సిద్ధం.. యాంగ్రీస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా!!
New script ready for angry star rajasekhar! కథ సిద్ధం.. యాంగ్రీస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా!!
Advertisement
Ads by CJ

‘అహనా పెళ్ళంట’.. ‘పూల రంగడు’ వంటి సక్సెస్ సినిమాలు తీసి తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న వీరభద్రం చౌదరి యాంగ్రీస్టార్ రాజశేఖర్ కోసం కథ సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తోంది. కాకితో కబురు పంపినా చాలు రాజశేఖర్ ఇంటికెళ్లి కథ చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారట.

రాజశేఖర్ నుంచి ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందా..? అని వీరభద్రం వేయికళ్లతో వేచి చూస్తున్నారట. మరోవైపు.. ఆల్రెడీ కథ చెప్పడం అయిపోయిందని.. మొత్తం విన్నాక రాజశేఖర్ కథ నచ్చిందా..? లేదా..? అనే విషయం డైరెక్టర్‌కు చెప్పలేదట. అయితే యాంగ్రీస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వీరభద్రం మాత్రం ఎదురుచూస్తున్నాడట. అయితే ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

కాగా.. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో వాట్ నెక్స్ట్ అంటూ ఆయన ఆలోచనలో పడ్డారు. సరిగ్గా ఇదే టైమ్‌లో వీరభద్రం చౌదరి ఆయన ఇంటికెళ్లడం.. కథ చెప్పడం ఇవన్నీ చకచకా జరిగిపోయాట. ఇప్పటికే నిర్మాత కూడా ఫిక్సవ్వగా రాజేశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? రెడ్ సిగ్నల్‌‌తో దూరం పెడతారా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

New script ready for angry star rajasekhar!:

New script ready for angry star rajasekhar!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ