భారత ప్రధాని నరేంద్ర మోదీ పట్ల సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం.. అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో మతవిద్వేషం పెరుగుతోందని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మోదీకి లేఖ రాయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘జై శ్రీరామ్’ అనేది ఓ రెచ్చగొట్టే యుద్ధ నినాదంలా మారిందని ఆ ప్రముఖులు లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా అనంత తీవ్రంగా తప్పుబట్టారు. ‘జై శ్రీరామ్’ పేరిట అరాచకాలు జరగుతున్నా మోదీ ఎందుకు మౌనం పాటిస్తున్నారు..? ఎందుకిలా మోదీ వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా.. ‘క్రిష్ణా రామా’ అనుకోవడమే తప్పా అని ప్రశ్నించారు. అంతటితో ఆగని ఆయన.. ‘నకిలీ మేథావులు మళ్లీ సకిలించారు అని పాట మొదలెట్టి నెత్తినోరు బాదుకోవాల్సిన పరిస్థితి.. అదీ మరి మేధావి దెబ్బంటే’ అని ముగించారు. ప్రస్తుతం అనంత్ పాట.. వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
కాగా.. ప్రధానికి లేఖ రాసిన వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన మణిరత్నం, శ్యామ్ బెనగల్‌తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మోదీ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.