Advertisementt

కళ్యాణ్ రామ్‌తో మరోసారి యంగ్ టైగర్..!

Sat 27th Jul 2019 02:34 AM
rrr,kalyan ram,mythri movie makers,jr ntr,kgf director,jr ntr and kalyan ram  కళ్యాణ్ రామ్‌తో మరోసారి యంగ్ టైగర్..!
Again Kalyan Ram Produces Young Tiger NTR Film కళ్యాణ్ రామ్‌తో మరోసారి యంగ్ టైగర్..!
Advertisement
Ads by CJ

అప్పుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ తమ్ముడు తారక్‌తో నిర్మించిన జై లవ కుశ సినిమాని నిర్మించి హిట్ కొట్టి.. అప్పుల నుండి బయటపడ్డాడు. గతంలో తమ్ముడు ఎన్టీఆర్ తో కాస్త దూరంగా ఉన్న కళ్యాణ్ రామ్ కొన్నాళ్లుగా ఎన్టీఆర్ తో కలిసిమెలిసి ఉంటూ టీడీపీకి కూడా దూరమయ్యాడు. ఇక తమ్ముడితో జై లవ కుశ సినిమాతో ఒడ్డెక్కిన కళ్యాణ్ రామ్ తరవాత హీరోగా సినిమాలు చేసుకుంటూ నిర్మాణ రంగానికి దూరంగా ఉంటున్నాడు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ మరోసారి తమ్ముడు తారక్ తో సినిమా నిర్మించబోతున్నాడనే న్యూస్ నందమూరి ఫ్యాన్స్‌కి నిద్రపట్టనీయకుండా చేస్తుంది. అన్నదమ్ములు ఇలా కలిసిమెలిసి సినిమాలు చేయాలని వారు అంటున్నారు.

అయితే కళ్యాణ్ రామ్‌తో ఎన్టీఆర్ చెయ్యబోయే సినిమా ఏమిటంటే ... ప్రస్తుతం రాజమౌళి RRR షూటింగ్ లో బిజీగా వున్న ఎన్టీఆర్ తరువాతి ప్రాజెక్ట్ మీద చాలా ఊహాగానాలే ఉన్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాలతో అని.. కాదు కాదు కెజిఎఫ్ సినిమాతో క్రేజ్ సంపాదించిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అని అంటున్నారు. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ వన్ తో భారీ హిట్ కొట్టాడు. తాజాగా కెజిఎఫ్ టు తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే కెజిఎఫ్ 2 సంగతెలా ఉన్నా.. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందనేది పక్కా అంటున్నారు మైత్రి వారు. 

అయితే ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమాని మైత్రి మూవీస్ నిర్మిస్తామని చెప్పారు. మైత్రి వారు మాత్రమే కాకుండా కళ్యాణ్ రామ్ కూడా మైత్రితో చేతులు కలపబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వినబడుతుంది. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాని మైత్రితో పాటుగా కళ్యాణ్ రామ్ కూడా నిర్మించబోతున్నాడని.. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరిగాయని ఫిలింనగర్ టాక్.

Again Kalyan Ram Produces Young Tiger NTR Film:

After RRR.. Kalyan Ram, Mythri Movie Makers and Jr NTR Combo on cards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ