Advertisementt

హైకోర్టు, ఖాకీలు పట్టించుకోకపోవడంతో నాగ్ హ్యాపీ!

Fri 26th Jul 2019 12:34 PM
nagarjuna,bigg boss-3,controversy,manmadhudu-2  హైకోర్టు, ఖాకీలు పట్టించుకోకపోవడంతో నాగ్ హ్యాపీ!
Nagarjuna reacts On Bigg Boss-3 Controversy హైకోర్టు, ఖాకీలు పట్టించుకోకపోవడంతో నాగ్ హ్యాపీ!
Advertisement
Ads by CJ

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్-3 పై ఎన్ని వివాదాలు రేగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చివరి నిమిషం వరకు అసలు ఈ షో రన్ అవుతుందా..? కాదా..? అనేదానిపై సస్పెన్షనే. ఓ వైపు దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మరోవైపు.. యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా పోలీసు స్టేషన్లు, తెలంగాణ హైకోర్టులో ఫిల్ వేయడంతో వివాదం మరింత పెద్దదైంది. అయితే ఈ వ్యవహారంపై హైకోర్టునుంచి అనుకూలంగా తీర్పురావడంతో షో షురూ అయ్యింది. ఈ వివాదంపై ఫస్ట్ టైమ్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున స్పందించారు.

"షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం చేసేటప్పుడు ఒకే చోట బిగుసుకుని కూర్చోవాల్సి వచ్చేది కానీ.. బిగ్ బాస్-3 షోలో మాత్రం అటూఇటూ తిరిగేందుకు స్వేచ్ఛ ఉంది. బిగ్ బాస్-3 ఇప్పటికి ఒక వారమే అయింది. నాకు తెలిసి బిగ్ బాస్ కార్యక్రమం 15 లేదా అంతకంటే ఎక్కువ దేశాల్లో నడుస్తోంది. వేర్వేరు భాషల్లో పలు సీజన్లలో విజయవంతంగా నడుస్తోంది. కాంట్రావర్సీలను గాలి నుంచి కూడా పుట్టించవచ్చు. తెలంగాణ పోలీసులు, హైకోర్టు ఈ విషయాన్ని పట్టించుకోవడంపై నేను సంతోషంగా ఉన్నాను. ఈ విషయంలో నిజంగా తప్పు జరిగితే దోషులను కఠినంగా శిక్షించాలి" అని నాగ్ తేల్చిచెప్పారు.

అంతటితో ఆగని ఆయన.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారు..? అనే విషయం తనకు చివరి 5 నిమిషాల వరకూ కూడా తెలియదన్నారు. ఈ షో వందరోజులు పూర్తి చేసుకున్న తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమా పట్టాలెక్కుతుందని నాగ్ స్పష్టం చేశారు. కాగా నాగ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ‘మన్మథుడు-2’ మూవీ ఆగస్ట్-09న రిలీజ్ కానున్న విషయం విదితమే.

Nagarjuna reacts On Bigg Boss-3 Controversy:

Nagarjuna reacts On Bigg Boss-3 Controversy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ