క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై భరత్ కమ్మ దర్శకత్వంలో సూపర్‌హిట్ చిత్రాల నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్ రంగినేని నిర్మిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంతో దక్షిణాదిన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు విజయ్ దేవరకొండ. జూలై 26న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో గ్రాండ్ ప్రీ- రిలీజ్ ను ఏర్పాటు చేశారు.
మైత్రి మూవీ మేకర్స్ వై.రవిశంకర్ మాట్లాడుతూ - ‘‘డియర్ కామ్రేడ్ దాదాపు సంవత్సరం కింద స్టార్ట్ అయింది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై 26న అందరూ థియేటర్‌లో సినిమా చూడండి’’ అన్నారు.
నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ - ‘‘ఇక్కడికి వచ్చిన మన కామ్రేడ్స్ అందరికి ధన్యవాదాలు. 2017 మే 9న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా నాలుగు భాషలలో విడుదల అవుతుంది అని తెలీదు. దీన్ని బట్టే తెలుస్తుంది విజయ్ దేవరకొండ పవర్ ఏంటో.. భరత్ కమ్మ అండ్ టీమ్ ఒకటిన్నర సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. టీమ్ అందరికీ థాంక్స్. రష్మిక ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి క్రికెట్ నేర్చుకుంది. ఈ సినిమా మీ అందరికీ ఒక ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటుంది. జూలై 26 మీరు అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చేయండి’’ అన్నారు.
నటుడు రాజ్ అర్జున్ మాట్లాడుతూ - ‘‘డియర్ కామ్రేడ్ తెలుగులో నా ఫస్ట్ మూవీ. ఇంత మంచి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంత కన్నా మంచి అవకాశం లభించదు. విజయ్ దేవరకొండ, రష్మికతో కలిసి నటించడం ఒక వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్. నన్ను సపోర్ట్ చేసిన దర్శక నిర్మాతలకి థాంక్స్’’ అన్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని మాట్లాడుతూ - ‘‘సినిమా మంచి విజయం సాధించాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అన్నారు.
చిత్ర దర్శకుడు భరత్ కమ్మ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా కోసం మూడేళ్ళ నుండి వర్క్ చేస్తున్నాను. 2017లో నేను ఎడిట్ రూమ్‌లో ‘పెళ్లి చూపులు’ సినిమా చూశాను. చాలా నచ్చింది. ఆ రోజు నాకు విజయ్ ఫోన్ చేశాడు. అర్జున్ రెడ్డి టైమ్ లో ఈ కథ చెప్పాను. అప్పటికి నేను కన్ఫర్మ్ చేసిన పేరు డియర్ లిల్లీ. కానీ ‘అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత నాకు కొంచెం భయం వేసింది. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవడానికి కారణం విజయ్ వాళ్ళ నాన్న గారు. అలాగే లిల్లీ క్యారెక్టర్ కోసం చాలా రీసర్చ్ చేశాం. తరువాత ‘గీత గోవిందం’ చూసి రష్మికని సెలెక్ట్ చేశాం. వీళ్లిద్దరి పెర్ఫామెన్స్ లు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. అలాగే బిగ్ బెన్, మైత్రి మూవీస్ తో ఈ సినిమా కాన్వాస్ మారింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ప్రాణం పెట్టి చేశారు. ‘డియర్‌కామ్రేడ్’ తప్పకుండా మంచి హిట్ అవుతుంది’’ అన్నారు.
హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ - ‘‘నేను మొదట్లో ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో ఫైట్ చేయాల్సి వచ్చింది. భరత్ సర్ ఈ సినిమా స్క్రిప్ట్ పంపినప్పుడు నాకు పిచ్చిగా నచ్చింది. మా పేరెంట్స్ వద్దు అన్నారు. కానీ నేను ఈ స్క్రిప్ట్ చేయాలని ఉంది అని చెప్పి పెద్ద ఫైట్స్ చేయాల్సి వచ్చింది. తరువాత క్రికెట్ ప్రాక్టీస్‌లో ఎన్నో గాయాలు అయ్యాయి. అయినా వేటిని లెక్క చేయకుండా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాను. అది మీరు ట్రైలర్‌లో చూడొచ్చు. విజయ్ అమేజింగ్ యాక్టర్. తరువాత నాలుగు రాష్ట్రాల్లో మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించాము. అన్ని రాష్ట్రాల్లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు కూడా అంత కంటే మంచి రెస్పాన్స్ వస్తుంది’’ అన్నారు.
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ‘‘నేను యాక్టర్ అయినప్పటి నుండి ఇప్పటివరకు నేను ఎక్కడికి వెళ్లినా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మ్యూజికల్ ఫెస్టివల్స్ విజయవంతం అయ్యాయి. నేను నాలా ఉండడమే మీ అందరికి నచ్చితుంది. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రాణం లిల్లీ, ప్రతి అమ్మాయి క్యారెక్టర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. రష్మిక ఎంత కష్టపడింది అనేది ఈ సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. బిగ్ బెన్ సినిమాస్, మైత్రి మూవీస్ చాలా సపోర్ట్ చేశాయి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు. ఈ జర్నీ మా అందరికీ నచ్చింది. జస్టిన్ మ్యూజిక్ అదరగొట్టాడు. మై మోస్ట్ ఫేవరైట్ ఆల్బమ్. సుజిత్ ఈ సినిమాకు ప్రాణం పెట్టాడు. అందరూ కొత్త వారు అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నిన్న కరణ్ ఈ సినిమా చూసి ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు అని పొగిడారు. భరత్ నాకు చాలా కాలంగా తెలుసు. మూడు సంవత్సరాలుగా నా సక్సస్‌లు చూశాడు. ఫెయిల్యూర్స్ చూశాడు. ప్రతి సినిమా గురించి భరత్‌తో మాట్లాడాను. ఇప్ప్పుడు ఒక బ్యూటిఫుల్ సినిమా నాకిచ్చాడు. సినిమా అంటే చాలా ప్యాషన్. తను ఒక బ్రిలియంట్ డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా నా డియర్ కామ్రేడ్స్ అందరికీ అంకితం. అలాగే భరత్ కమ్మ వాళ్ళ నాన్న గారికి కూడా అంకితం. జూలై 26 అందరూ సినిమా చూడండి’’ అన్నారు.