Advertisementt

త్రివిక్రమ్ సెంటిమెంట్.. టబు వచ్చేసింది

Fri 26th Jul 2019 05:27 AM
aa19 movie,latest,update  త్రివిక్రమ్ సెంటిమెంట్.. టబు వచ్చేసింది
Tabu Joined AA19 Shooting త్రివిక్రమ్ సెంటిమెంట్.. టబు వచ్చేసింది
Advertisement
Ads by CJ

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈసినిమాలో ఓ ముఖ్య పాత్రలో సీనియర్ నటి టబు నటిస్తుంది. రీసెంట్ గా ఆమె షూటింగ్ లో పాల్గొననున్నారు.

ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ అత్తారింటికి దారేది చిత్ర విజయం తరువాత నుండి తన చిత్రాలలో ఓ పవర్ఫుల్ లేడీ రోల్ చుట్టూ కథ రాసుకుంటున్నారు. ఈమూవీ తరువాత అ ఆ చిత్రంలో నదియాతో మహాలక్ష్మి అనే పాత్ర చేయించాడు. అజ్ఞాతవాసి చిత్రంలో ఖుష్బూ పవన్ కు తల్లిగా చేసింది.

అయితే బన్నీ సినిమాలో టబు అత్త పాత్రే చేస్తుంది. త్రివిక్రమ్ ఈసినిమాను సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిస్తున్నాడు. బన్నీకి సిస్టర్ పాత్రలో నివేదా థామస్ కనిపించనుంది. అత్తారింటికి దారేది, అ ఆ చిత్రాలలో అత్త ఎంత హైలెట్ అయిందో అదేవిధంగా ఈచిత్రంలో కూడా టబు అంతే హైలెట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈమూవీలో హీరో సుశాంత్, నవదీప్ కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tabu Joined AA19 Shooting:

AA19 Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ