Advertisementt

వివి వినాయక్ ఆవిష్కరించిన రథేరా ట్రైలర్

Fri 26th Jul 2019 05:20 AM
vv vinayak,rathera movie,trailer,launched  వివి వినాయక్ ఆవిష్కరించిన రథేరా ట్రైలర్
VV Vinayak Launches Rathera Movie Trailer వివి వినాయక్ ఆవిష్కరించిన రథేరా ట్రైలర్
Advertisement
Ads by CJ

రథేరా మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించిన డేరింగ్ డైరెక్టర్ వి వి వినాయక్ 

పూల సిద్దేశ్వర రావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం రథేరా. జాకట్ రమేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పూల సిద్దేశ్వర రావు, నరేష్ యాదవ్, వై ఎస్ కృష్ణమూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ ఇటీవల తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో పూల సిద్దేశ్వర రావు, దర్శకుడు జాకెట్ రమేష్, నిర్మాత వై ఎస్ కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, నీనోరకం చిత్ర దర్శకుడు సుదర్శన్ మరియు సుగన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డేరింగ్ డైరెక్టర్ వి వి వినాయక్ మాట్లాడుతూ - ‘‘ట్రైలర్ చాలా బాగుంది, ఆర్టిస్టులు అందరూ కొత్తవారిని తీసుకొని అద్భుతంగా దర్శకుడు రమేష్ సినిమాను రూపొందించారు.  టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో కి మొదటి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న వాడిలా నటించాడు. తనకి మంచి ఫ్యూచర్ ఉంది. దర్శకుడు మంచి కంటెంట్ తో సినిమా తెరకెక్కించారు. మ్యూజిక్ తో పాటు ఆర్.ఆర్ కూడా బాగుంది. తప్పకుండా అతనికి ఈ సినిమా ద్వారా మంచి బ్రేక్ వస్తుంది. అలాగే నిర్మాత కృష్ణమూర్తి గారికి ఈ సినిమా ద్వారా మరిన్ని డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ - ‘‘వి వి వినాయక్ గారు మా చిత్ర ట్రైలర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎంతో మంది నూతన దర్శకులకి ఇన్స్పిరేషన్. ఆయన ట్రైలర్ విడుదల చేయడంతో మా సినిమాకు మంచి భజ్ వచ్చింది. మంచి కంటెంట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అందరూ కొత్త వారికే ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సంగీతంతో పాటు ఆర్ ఆర్ కి మంచి ప్రశంసలు వస్తున్నాయి. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు.

నిర్మాతలు  మాట్లాడుతూ - ‘‘వినాయక్ గారికి కృతజ్ఞతలు. దర్శకుడు ఎంతో ఫ్యాషన్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషన్స్ ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా చాలా బాగా వస్తుంది. తప్పకుండా మీ అందరకీ నచ్చుతుంది’’ అన్నారు.

VV Vinayak Launches Rathera Movie Trailer:

Rathera Movie Trailer Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ