తెలుగు బిగ్‌బాస్-3 షోను అక్కినేని నాగార్జున విజయవంతంగా నడిపిస్తున్నారు. సీజన్ 1,2, లతో పోలిస్తే నాగ్ ఈ సీజన్‌ను రక్తికట్టిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీజన్ 3కే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్-02 విన్నర్ కౌశల్ ఈ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. కౌశల్ మాట్లాడుతూ హౌస్‌లో తన పేరును ఎక్కడా వాడటానికి వీల్లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. పబ్లిసిటీ కోసం కానీ ఇంటర్వ్యూల్లో కూడా ‘కౌశల్ ఆర్మీ’ అనే పేరు వాడొద్దని తేల్చిచెప్పేశారు. కాగా.. ‘కౌశల్ ఆర్మీ’తోనే కౌశల్ గెలిచిన విషయం విదితమే.
అయితే సీజన్-03 ప్రారంభంలోనే ‘శ్రీముఖి ఆర్మీ’ పేరిట సోషల్ మీడియాలో ఖాతాలను తెరిచి హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీముఖి.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని. పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అందరూ శ్రీముఖికి సపోర్ట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో కూడా పవన్ వీరాభిమానినే గెలిపించాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.