Advertisementt

అమెరికాలో రానా.. అక్కడే ‘డియర్ కామ్రేడ్’!

Thu 25th Jul 2019 07:44 PM
rana daggubati,vijay devarakonda,dear comrade,rashmika mandanna  అమెరికాలో రానా.. అక్కడే ‘డియర్ కామ్రేడ్’!
Rana Wishes Vijay Devarakonda.. అమెరికాలో రానా.. అక్కడే ‘డియర్ కామ్రేడ్’!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన అమెరికాలో చికిత్స పొందుతున్నారని.. అంతేకాదు ఆయనకు తల్లి కిడ్నీ ఇచ్చిందని పెద్దఎత్తున పుకార్లు వస్తున్నాయి. అయితే ఇంతవరకూ ఈ వార్తలన్నీ అక్షరాలా అబద్ధమని అందరూ అనుకున్నారు. అయితే అమెరికాలో రానా ఉన్న మాట మాత్రం వాస్తవమే. ఈ విషయం స్వయానా ఆయనే చెప్పుకొచ్చారు. చికిత్స సంగతి మాత్రం చెప్పలేదు.

హిట్ చిత్రాల హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నటీనటులుగా తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ నెల 26న తెలుగు రాష్ట్రాల్లో.. 25న అమెరికాలో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్న రానా.. ఇక్కడే సినిమా చూస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండతో పాటు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

మొత్తానికి చూస్తే తెలుగు రాష్ట్రాల్లోకి ‘డియర్ కామ్రేడ్’రాక ముందే రానా సినిమా చూసి రిజల్ట్ చెప్పేస్తారన్న మాట. మూవీ చూసిన తర్వాత రానా విజయ్‌కు ఎన్ని మార్కులేస్తారో..? రివ్యూ ఎలా చెబుతారో తెలియాలంటే సోషల్ మీడియాలోకి రానా ఎప్పుడొస్తారా అని వేచి చూడాల్సిందే మరి.

Rana Wishes Vijay Devarakonda.. :

Rana Wishes Vijay Devarakonda.. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ