తెలుగు బిగ్‌బాస్-3 సీజన్ జులై 23న ప్రారంభమై విజయవతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటరయ్యారు. ఇటు మన్మథుడు హోస్టింగ్‌తో రక్తికట్టిస్తుండగా.. 15 మంది కంటెస్టెంట్లతో రచ్చరచ్చ అయ్యింది. అయితే ఈ 15 మందిలో 7 మాత్రమే సూపర్ డూపర్ హిట్టవ్వగా.. మిగిలిన ఎనిమిది మంది ఆశించినంతగా రాణించలేకపోతున్నారు.
సూపర్ హిట్టయిన వాళ్లు వీరే..
01.. శ్రీముఖి
02.. వరుణ్ సందేశ్, వితికా షెరూ
03.. బాబా భాస్కర్
04.. అలీ రెజా
05.. హేమ
06.. శివ జ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి
07.. ఫన్ బకెట్ ఫేమ్ మహేష్ విట్ట
ఈ సీజన్‌లో ఈ ఏడుగురు మాత్రమే చాలా ఆసక్తిగా కనిపిస్తున్నారు. మిగిలిన వారంతా పెద్దగా ఆసక్తిగా.. ఆశించినంతగా హిట్టవ్వలేకపోతున్నారు. అంతేకాదు.. ఈ ఏడుగురిలో ఒకరు మాత్రం పక్కాగా గెలుస్తారని అంతా అనుకుంటున్నారు. మరి ‘గెలుపు’ అనే అదృష్టం ఎవర్ని వరిస్తుందో వేచి చూడాల్సిందే.