Advertisementt

నంది అవార్డు చిత్రం దర్శకుడి కొత్త చిత్రమిదే!

Wed 24th Jul 2019 09:32 PM
nandi award,hithudu,new film,k viplav director,abhilash,raghav,ksv presentation  నంది అవార్డు చిత్రం దర్శకుడి కొత్త చిత్రమిదే!
Nandi Award Winner Director New Film Details నంది అవార్డు చిత్రం దర్శకుడి కొత్త చిత్రమిదే!
Advertisement
Ads by CJ

గతంలో నంది అవార్డు పొందిన చిత్రం ‘హితుడు’. 2015లో కె.ఎస్.వి. బేనర్ మీదుగా విడుదలైన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అందులో నక్సలైట్‌గా జగపతిబాబు పాత్రను తీర్చిదిద్దిన విధానం, మలయాళీ నటి మీరానందన్ తన పాత్రలో ఒదిగిపోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్ర దర్శకుడైన కె. విప్లవ్ ఇప్పుడు నూతన చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కేఎస్వీ సమర్పణలో సిరంజ్ సినిమా పతాకంపై ఓ సున్నితమైన ప్రేమకథాచిత్రంగా ఆయన దీనిని మలచనున్నారు. 

‘ప్రేమకు రెయిన్ చెక్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన అభిలాష్.., ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘మిస్టర్ మజ్ను’ వంటి చిత్రాల్లో నటించి, మెప్పించిన రాఘవ్ కథానాయకులుగా ఈ చిత్రానికి ఎంపికయ్యారు. ఈ తరం యువత జీవనశైలికి దగ్గరగా ఉంటుందని, ఆద్యంతం మనసును రంజింపజేసే సన్నివేశాలతో పాటు ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లుగా దర్శకుడు కె. విప్లవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్ర్కిఫ్ట్ పనులు పూర్తికావచ్చాయని, త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సమర్పణ: కేఎస్వీ.

Nandi Award Winner Director New Film Details:

Hithudu Movie Directors’s New Film Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ