సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ . ఫస్ట్ టైమ్ ఇటు డైరెక్టర్.. అటు రష్మిక కాంబోలో మహేశ్‌తో వస్తున్న సినిమా ఇది. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను కశ్మీర్‌తో పాటు పలు ప్రాంతాల్లో పూర్తి చేసిన చిత్రబృందం త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించబోతోంది. అయితే ‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘సరిలేరు నీకెవ్వరు’ గురించి మాట్లాడింది.
ఈ సందర్భంగా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు కాసింత వెరైటీగా ఈ ముద్దుగుమ్మ సమాధానమిచ్చింది. మహేశ్‌తో కలిసి నటించడం లక్‌గా భావిస్తున్నారా..? అని మీడియా మిత్రులు అడగ్గా చాలా లాజిక్‌గా బదులిచ్చింది. లక్కీనా.. అబ్బే అదేం లేదే.. ఎలాంటి అవకాశాలైనా సరే హార్డ్ వర్క్ చేయడం వల్లే వస్తాయంతేనని చెప్పుకొచ్చింది. తాను ఫుల్ హార్డ్‌వర్క్ చెయ్యడం వల్లే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయని ఫీల్ అవుతున్నానని రష్మిక చెప్పింది.
వాస్తవానికి మహేశ్ లాంటి సూపర్ స్టార్‌తో కలిసి నటించే అవకాశం వస్తే చాలు నటీనటులు చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఇక మహేశ్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చినా.. స్క్రీన్‌ను షేర్ చేసుకునే అవకాశం వచ్చినా నిజంగానే ‘లక్కీ’.. అదృష్టమేనని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్ వరకు పలువురు నటీమణులు మహేశ్‌తో కలిసి నటించే అవకాశం ఒకే ఒక్కసారి వస్తే చాలని చెబుతుంటారు. అయితే రష్మిక మాత్రం ఇలా మాట్లాడటంతో అభిమానులు ఒకింత నొచ్చుకున్నారట. అవున్లెండి ఎలాగో వరుస హిట్లతో ఊపు మీదు ఉందిగా.. ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలా అని క్రిటిక్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.