ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో డాషింగ్ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఆశించినన్ని సినిమాలు లేకపోవడం కూడా ఇస్మార్ట్‌కు ఒక లక్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగులో సూపర్ హిట్టయిన ఈ సినిమా ఓవర్సీస్‌లో మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది.!
తెలుగులో ఈ ఏడాది రిలీజయిన సినిమాల్లో ఇండియాలో ఆశించినంత.. ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్ల వర్షం కురిపించినప్పటికీ ఓవర్సీస్‌లో మాత్రం అస్సలు ఆడలేదు. ఇందుకు ఉదాహరణ బోయపాటి తెరకెక్కించిన ‘వీవీఆర్’ అని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటీవల తెలుగు రిలీజైన సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ కూడా ఓవర్సీస్‌లో ఆశించినంతగా కలెక్షన్లు రాకపోవడంతో డిజాస్టర్‌గానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా అదే కోవలోకి చేరింది.
ఇక్కడేమో భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న శంకర్.. విదేశాల్లో మాత్రం ఇప్పటి వరకు కనీసం 2 లక్షల డాలర్లు కూడా దాటలేకపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ హిట్.. అక్కడ ఫట్ అన్న మాట. మరి ఫైనల్‌గా అయినా ‘ఇస్మార్ట్ శంకర్’ ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో లేకుంటే అంతే సంగతులో..!!