పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ ‘జనగణమన’ ముందు మహేష్ బాబుతో చేయాలి అనుకున్నాడు కానీ పూరి ఫ్లాపుల్లో కూరుకుపోవడంతో మహేష్.. పూరిని పక్కన పెట్టేసాడు. ఇది ఓపెన్ గా పూరి ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఇది మహేష్ కోసం రాసుకున్న కథ అయినప్పటికీ ఈ మూవీ విజయ్ దేవరకొండతో పూరి చేయడానికి రెడీ అయ్యాడు అని ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి అని త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని అంతా భావించారు కానీ ఇవన్నీ రూమర్స్ అని హీరో విజయ్ కొట్టిపారేశాడు.
రీసెంట్ గా ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. “పూరిగారితో సినిమా చేస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా మధ్య అలాంటి చర్చలు ఏమీ జరగలేదు. ఏదైనా వుంటే నేనే చెప్తా. ఇప్పుడు వస్తున్న వార్తలు మాత్రం రూమర్స్” అని క్లారిటీ ఇచ్చాడు విజయ్. అలానే కొరటాల - విజయ్ దేవరకొండ సినిమా గురించి కూడా విజయ్ క్లారిటీ ఇచ్చాడు.
‘‘కొరటాలతో నేను ఎప్పటినుండో సినిమా చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం ఆయన చిరంజీవితో సినిమా చేయనున్నారు. అది కంప్లీట్ అయిన తరువాత నేను అప్పటికీ రెడీగా వుంటే తప్పకుండా సినిమా చేస్తాం. అయితే అది ఇప్పుడే నేను కంఫర్మ్ చేయలేను’’. అని చప్పుకొచ్చాడు విజయ్. సో ఇలా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పై విజయ్ క్లారిటీ ఇచ్చాడు.