Advertisementt

‘వాల్మీకి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Wed 24th Jul 2019 02:29 AM
varun tej,valmiki movie,release,september 13  ‘వాల్మీకి’ రిలీజ్ డేట్ ఫిక్స్
Valmiki Movie Release Date Fixed ‘వాల్మీకి’ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై శ‌ర‌వేగంగా రూపొందుతోన్న వ‌రుణ్ తేజ్‌, హ‌రీష్ శంక‌ర్ ‘వాల్మీకి’.. సెప్టెంబ‌ర్ 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌

కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించిన క‌థానాయ‌కుడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ముకుంద‌, కంచె, అంత‌రిక్షం, ఫిదా, తొలిప్రేమ‌, ఎఫ్‌2 వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడీ యువ క‌థానాయ‌కుడు. 

అలాగే హీరో బాడీ లాంగ్వేజ్‌ను స‌రికొత్త‌గా ప్రెజెంట్ చేస్తూ సినిమాను క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించ‌డంలో దిట్ట డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌.ఎస్.... సూప‌ర్ హిట్ చిత్రాలు ‘మిర‌ప‌కాయ్‌’, ‘సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌’, ఇండ‌స్ట్రీ హిట్ ‘గ‌బ్బ‌ర్ సింగ్‌’, సెన్సేష‌న‌ల్ హిట్ ‘డీజే దువ్వాడ జ‌గ‌న్నాథమ్‌’ వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్సే హ‌రీష్ మేకింగ్‌కు ఉదాహ‌ర‌ణ‌లు. 

ఇలా వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించడానికి ఆస‌క్తి చూపే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో వ‌రుణ్ తేజ్‌, ఇండ‌స్ట్రీ హిట్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్రం ‘వాల్మీకి’.

14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

న‌టీన‌టులు: 

వ‌రుణ్ తేజ్‌, అధ‌ర్వ ముర‌ళి, పూజా హెగ్డే, మృణాళిని ర‌వి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ఫైట్స్‌: వెంక‌ట్‌

ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌

ఎడిటింగ్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌

సంగీతం:  మిక్కి జె.మేయ‌ర్‌

నిర్మాత‌లు:  రామ్ ఆచంట‌, గోపి ఆచంట‌

స్క్రీన్ ప్లే: మ‌ధు శ్రీనివాస్‌, మిథున్ చైత‌న్య‌

ద‌ర్శ‌క‌త్వం: హ‌రీష్ శంక‌ర్‌.ఎస్‌

Valmiki Movie Release Date Fixed:

Valmiki Movie Release on september 13

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ