మెగాస్టార్ చిరంజీవిని తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్న సురేందర్ రెడ్డి ప్రస్తుతం సైరా చిత్ర పోస్ట్ ప్రొడక్షన్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా భారీ అంచనాలు మధ్య అక్టోబర్ 2న రిలీజ్ అవ్వనుంది. త్వరలోనే ప్రమోషన్స్ వగైరా స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి ఎవరితో సినిమా చేస్తాడు అనేది పెద్ద ప్రశ్న.
పెద్ద డైరెక్టర్స్ అంతా తలొక లైన్ చెప్పేసి హీరోస్ ని బుక్ చేసుకున్నారు. మరి సురేంద్ర రెడ్డి పరిస్థితి ఏంటి? సైరా తర్వాత సురేందర్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాడు. మహా అయితే ఒక ఆరు నెలలు తీసుకుంటే తర్వాత అయినా సినిమా స్టార్ట్ చేయాలి కదా? మరి అది ఎవరితో?
నిజానికి సురేందర్ రెడ్డి మహేష్‌తో ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ మహేష్ ఇప్పటిలో ఖాళీగా లేడు. అలానే బన్నీ..సురేంద్ర రెడ్డితో సినిమా మంచి మాస్ ఎంటర్టైనర్ చేయాలి అనుకున్నాడు. అయినా బన్నీ కూడా ఖాళీగా లేడు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ అయితే కచ్చితంగా రెండేళ్లు పాటు ఖాళీ లేరు. మరి ఈలోపల సురేంద్ర రెడ్డి మీడియం రేంజ్ హీరోస్‌తో లాగించేస్తాడా? లేదా? చూడాలి.