Advertisementt

‘గుణ 369’ లోని మూడో పాట వదిలారు

Tue 23rd Jul 2019 01:41 PM
raghavendra rao,guna 369 movie,3rd song,launches  ‘గుణ 369’ లోని మూడో పాట వదిలారు
Guna 369 Movie 3rd Song Launched ‘గుణ 369’ లోని మూడో పాట వదిలారు
Advertisement
Ads by CJ

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చేతుల మీదుగా ‘గుణ 369’ లోని మూడో పాట విడుద‌ల‌!

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చేతుల మీదుగా ‘గుణ 369’లోని మూడో పాట సోమ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌లైంది. 

‘ఆర్‌.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ హీరోగా, మ‌ల‌యాళ భామ‌ అన‌ఘ నాయిక‌గా తెర‌కెక్కిన చిత్రం ‘గుణ 369’. బోయ‌పాటి శ్రీను ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన  అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్ర‌మిది.  శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలోని తొలి పాట‌ను  స్టార్ ప్రొడ్యూస‌ర్ ‘దిల్‌’ రాజు, రెండో పాటను ప్ర‌ముఖ హాస్య న‌టులు బ్ర‌హ్మానందం, అలీ విడుద‌ల చేశారు. ఇటీవ‌ల ట్రైల‌ర్‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, మాస్ డైర‌క్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ఆవిష్క‌రించారు. తాజాగా మూడో పాట‌ను విడుద‌ల చేసిన 

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ.. ‘‘గుణ 369 ట్రైల‌ర్ చూశా. ఇవాళ నా చేతుల మీదుగా ఓ పాట విడుద‌లైంది. సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ స్వ‌ర‌ప‌ర‌చ‌గా, రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన ఈ పాట చాలా బావుంది. ట్యూన్ బావుంది. లిరిక్ బావుంది. దృశ్యాన్ని చిత్రీక‌రించిన తీరు బావుంది. ట్రైల‌ర్‌లో హీరో పెర్ఫార్మెన్స్, యాక్ష‌న్ బావుంది. ఈ సినిమాను నాకు ఎంతో స‌న్నిహితులైన అనిల్‌, ప్ర‌వీణ‌, తిరుమ‌ల్‌రెడ్డి క‌లిసి నిర్మిస్తున్నారు.  వీరు ముగ్గురూ ఎన్నో అద్భుత‌మైన షోలు మ‌న ద‌గ్గ‌ర‌, విదేశాల్లోనూ నిర్వ‌హించారు. వారు తొలిసారి సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఆ షోలు ఎంత అద్భుతంగా విజ‌య‌వంతమ‌య్యాయో, ఈ సినిమా కూడా అంతే గొప్ప‌గా హిట్ కావాల‌ని ఆశిస్తున్నాం.  కొత్త‌గా వ‌స్తున్న ద‌ర్శ‌కుడు అర్జున్ ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటాడ‌ని, భ‌విష్య‌త్తులో మంచి సినిమాలు చేస్తాడ‌ని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో ప‌నిచేసిన మిగిలిన టెక్నీషియ‌న్లు అంద‌రికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.

రామ‌జోగ‌య్య‌శాస్త్రి మాట్లాడుతూ.. ‘‘మంచి మీనింగ్‌ఫుల్‌, సిట్చువేష‌న‌ల్ సాంగ్ నేను ఇందులో రాశాను. ఈ పాట‌ ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుగారి అమృత‌హ‌స్తాల‌ మీదుగా విడుద‌ల కావ‌డం, నాకు  చాలా సంతోషంగా ఉంది. ఈ రిలీజ్‌ని ఇలా ప్లాన్ చేసిన ప్ర‌వీణగారికి, అనిల్‌గారికి, తిరుమ‌ల‌రెడ్డిగారికి మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్. ఎప్పుడు న‌న్ను చూసినా రాఘ‌వేంద్ర‌రావుగారి క‌ళ్ల‌ల్లో  ప్రేమ‌, ఆప్యాయ‌త, ఆనందం, సంతృప్తి క‌నిపిస్తుంటాయి. అది... మ‌న‌సులు మ‌న‌సులు మాట్లాడుకునేలా నాకు బోధ‌ప‌డుతుంటుంది. ఎన్నో రికార్డులు సృష్టించిన చ‌రిత్ర ఉన్న వ్య‌క్తి చేతుల మీదుగా నా పాట విడుద‌ల కావ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా ఇష్ట‌మైన పాట‌. విజ‌య్ ఏసుదాస్‌, శ్వేతా మోహ‌న్ చాలా బాగా పాడారు. నా ఫేవ‌రేట్ సింగ‌ర్స్ వాళ్లు.  చైత‌న్ భ‌రద్వాజ చాలా మంచి కుర్రాడు. టాలెంట్ ఉన్న వ్య‌క్తి. ఈ కాలానికి, ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా అటు మోడ్ర‌న్‌గానూ చేయ‌గ‌ల‌డు. స్ట‌ఫ్‌, మేట‌ర్ ఉన్న కంపోజిష‌న్ కూడా చేయ‌గ‌ల‌డు. ఈ కాలానికి స‌రిపోయే సంగీత ద‌ర్శ‌కుడు. మంచి బాణీలు ఇవ్వ‌డంతో పాటు, మంచి రీరికార్డింగ్ కూడా చేయ‌గ‌ల‌డు. అత‌నితో ఇంట‌రాక్ట్ అవుతున్న‌ప్పుడు కూడా అత‌నిలోని సెన్సిబిలిటీస్ నాకు అర్థం కాసాగాయి. వృద్ధిలోకి వ‌చ్చే కుర్రాడు. అలాగే అర్జున్ జంధ్యాల నాకు మా బోయ‌పాటి గారి ద‌గ్గ‌ర ప‌రిచ‌యం. సిన్సియారిటీకి పోతపోస్తే ఇలా ఉంటాడ‌నిపిస్తుంది. ఇటీవ‌ల బోయ‌పాటిగారు కూడా అత‌ని గురించి చెప్పిన మాట‌లు అక్ష‌ర స‌త్యాలు. అత‌నికి ఓ ప‌ని అప్ప‌గిస్తే దాని గురించి ఇక మ‌నం ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. అంత మంచి విష‌యం అది. జీవితంలో మ‌న‌ల్ని ముందుకు న‌డిపించే విష‌యం అది. ఈ స్క్రిప్ట్ కూడా క‌మ‌ర్షియ‌ల్ పంథాలో ఉంటూనే, ఒక కొత్త పాయింట్‌ను చెబుతుంది. తెలుగులో అంత‌గా ఎవ‌రూ ఎక్కువ‌గా ట‌చ్ చేయ‌ని పాయింట్ ఇందులో ఉంటుంది. దానికి మ‌న తెలుగులో మంచి హీరో దొరికాడు. బాడీ బిల్డ‌ప్ ఉన్నప్ప‌టికీ, అత‌నిలో నాకు బాగా న‌చ్చే విష‌యం ఏంటంటే.. ఒక ఇన్నొసెన్స్ ఉంటుంది ఆ ఫేస్‌లో. ట్రైల‌ర్‌లో చూసిన ల‌వ్ ట్రాక్‌లోనూ చాలా ఈజ్‌తో చేశాడు. అర్జున్‌కి ల‌డ్డులాగా దొరికాడు. త‌ప్ప‌కుండా ఈ సినిమా మొద‌టిసారిగా సినిమా నిర్మాణంలోకి వ‌చ్చిన అనిల్ గారికి, ప్ర‌వీణ‌కు పెద్ద హిట్ అవుతుంది. అనుకున్న ప‌నిని నిర్విఘ్నంగా పూర్తి చేయ‌డం వారికి వెన్న‌తో పెట్టినవిద్య‌. వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అర్జున్ మ‌రిన్ని సినిమాల‌తో ముందుకెళ్లాలి. అనిల్‌గారి టీమ్ మ‌రిన్ని గొప్ప సినిమాలు తీయాలి’’ అని అన్నారు.

చైతన్ భరద్వాజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ పాట‌కు సిట్చువేష‌న్ మెయిన్‌. దాన్ని అర్జున్‌గారు చాలా బాగా అర్థ‌మ‌య్యేలా చెప్పారు. దానికి రామ‌జోగ‌య్య‌శాస్త్రిగారు అర్థ‌మ‌య్యేలా చ‌క్క‌టి ప‌దాల‌తో రాశారు. ఏ పాట‌యినా బాగా ఎలివేట్ అయింది అంటే దానికి కార‌ణం మంచి లిరిక్స్, వాటిని పాడిన సింగ‌ర్స్... వారిద్ద‌రి వ‌ల్ల‌నే కంపోజ‌ర్ ప‌డిన ఎఫ‌ర్ట్ బ‌య‌టి ప్ర‌పంచానికి తెలుస్తుంది.  రెండు వంద‌ల శాతం ఈ పాట అంద‌రికీ న‌చ్చుతుంద‌ని కాన్ఫిడెంట్‌గా ఉన్నా. న‌న్ను న‌మ్మి ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చిన అర్జున్‌గారికి, నిర్మాత‌లు ప్ర‌వీణ‌గారికి, అనిల్‌గారికి, తిరుమ‌ల్‌గారికి ధ‌న్య‌వాదాలు’’ అని చెప్పారు. 

నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కె.రాఘ‌వేంద్ర‌రావుగారు పాజిటివిటీ ఉన్న వ్య‌క్తి. మంచి ఎక్క‌డున్నా వెంట‌నే అభినందిస్తారు. మా సినిమా ట్రైల‌ర్ చూసి బావుంద‌ని మెచ్చుకున్నారు. మా చిత్రంలో రామ‌జోగయ్య‌శాస్త్రి రాసిన పాట‌ను ఆయ‌న  చేతుల మీదుగా విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఆగ‌స్ట్ 2న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. మంచి సినిమా చేశామ‌ని సంతృప్తి మాలో ఉంది. ట్రైల‌ర్ చూసిన వారంద‌రూ హిట్ గ్యారంటీ అని అంటున్నారు’’ అని అన్నారు. 

సాంకేతిక నిపుణులు

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్‌, 

కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, 

ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్,

 ఎడిటర్ : తమ్మిరాజు , 

డాన్స్ : రఘు, 

ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు : స‌త్య కిశోర్‌, శివ మల్లాల.

Guna 369 Movie 3rd Song Launched:

Raghavendra Rao Launches Guna 369 Movie 3rd song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ