Advertisementt

‘ఇస్మార్ట్ శంకర్’కి అంత సీనుందా..!

Tue 23rd Jul 2019 01:27 PM
ismart shankar,bollywood,dreams  ‘ఇస్మార్ట్ శంకర్’కి అంత సీనుందా..!
Who Takes Ismart Shankar in Bollywood ‘ఇస్మార్ట్ శంకర్’కి అంత సీనుందా..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ కి వెళ్లడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఇక్కడ భారీ హిట్స్ అయితే బాలీవుడ్ స్టార్ హీరోలు ఆ హిట్స్ ని హిందీలో రీమేక్ చేసి హిట్స్ కొట్టేస్తున్నారు. అలా టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లిన సినిమాలో పోకిరి, అర్జున్ రెడ్డి, టెంపర్ ఇలా చాలానే సినిమాలు ఉన్నాయి. మరి పూరి తీసిన పోకిరి, టెంపర్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక పూరి జగన్నాధ్ కూడా బాలీవుడ్ లో డైరెక్ట్ గా అమితాబ్ బ‌చ్చ‌న్‌తో బుడ్డా హోగాతేరా బాప్‌ సినిమా తీసి భారీ హిట్ కొట్టాడు. ఇక తాజాగా పూరి జగన్నాధ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ కూడా బాలీవుడ్ కి వెళ్ళబోతున్నదనే న్యూస్ వినబడుతుంది.

రామ్ తో పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా గత గురువారమే వరల్డ్ వైడ్ గా విడుదలై యావరేజ్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ లో 40 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టింది. సినిమాలో రామ్ నటనకు తప్పించి మరే విషయం లేకపోయినా... మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చడంతో.. నిర్మాతలైన పూరి, ఛార్మి లు సేఫ్ అయ్యారు. కథ, కథనం, పూరి డైరెక్షన్స్ ఏమంత గొప్పగా లేకపోయినా సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. అయితే పూరి గతంలో కొట్టిన హిట్స్ తో పోలిస్తే ఇస్మార్ట్ మాత్రం అంత పెద్ద హిట్ అని చెప్పలేం. 

అయితే ఈసినిమా మీద బాలీవుడ్ లో ఓ నిర్మాత కన్ను పడిందని.. టెంపర్ రీమేక్ లో నటించిన రణ్వీర్ సింగ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాని పూరి జగన్నాధ్ తో రీమేక్ చేయించాలనే ఉద్దేశ్యంతో ఆ బాలీవుడ్ నిర్మాత ఉన్నాడని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ర‌ణ‌వీర్‌ సింగ్ తో పూరి మీటింగ్ ఉంటుంద‌ని... ఆ త‌ర‌వాత ఈ సినిమా రీమేక్ పై పూరి జగన్నాధ్ ఓ నిర్ణ‌యానికి రానున్నాడ‌ని తెలుస్తోంది. అయితే ఇస్మార్ట్ శంకర్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తే అంత గొప్ప హిట్ కాదని విశ్లేషకుల భావన.

Who Takes Ismart Shankar in Bollywood:

Ismart Shankar in Bollywood Dreams

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ