Advertisementt

దండుపాళ్యం 4 విడుదల ఎప్పుడంటే..?

Mon 22nd Jul 2019 07:43 PM
dandupalyam 4 movie,release date,august 15th dandupalyam 4 details  దండుపాళ్యం 4 విడుదల ఎప్పుడంటే..?
Dandupalyam 4 Movie Release Date Fixed దండుపాళ్యం 4 విడుదల ఎప్పుడంటే..?
Advertisement
Ads by CJ

సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, నిర్మాత మీడియా సమావేశం అయ్యారు. 

ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. ‘‘సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా సినిమాను ఖచ్చితంగా ఆగస్ట్ 15న విడుదల చెయ్యబోతున్నాము. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. ఈ ‘దండుపాళ్యం-4’ జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్‌ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’’ అన్నారు.

దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ.. ‘‘దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. బెనర్జీ, వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ పాత్రకు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి’’ అన్నారు.

నటీ నటులు :

సుమన్ రంగనాథన్, ముమైత్ ఖాన్, బెనర్జీ , వెంకట్  సంజీవ్ కుమార్ , అరుణ్ బచ్చన్,  డిఎస్ రావు, , రాక్ లైన్  సుధాకర్ బులెట్ సోము,  విఠల్ రంగయన్,  జీవ సైమన్ , సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్  , స్నేహ , రిచర్డ్  శాస్త్రి తదితరులు.

డైలాగ్స్: ఎం. రాజశేఖర్ రెడ్డి 

మ్యూజిక్: ఆనంద్ రాజా విక్రమ 

లిరిసిస్ట్:  భువనచంద్ర 

డి ఓ పి: గిరి బెనకరాజు

కోరియోగ్రఫీ: బాబా భాస్కర్ 

ఎడిటర్: బాబు ఏ  శ్రీవాత్సవ - ప్రీతి మోహన్  

పోరాటాలు: కుంగ్ ఫు చంద్రు 

నిర్మాత: వెంకట్ 

దర్శకత్వం: కె.టి.నాయక్

బ్యానర్:  వెంకట్ మూవీస్ 

Dandupalyam 4 Movie Release Date Fixed:

Dandupalyam 4 Movie Release on August 15th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ