టాలీవుడ్ హీరో మహేశ్ ‘పోకిరి’ సినిమాతో సూపర్ స్టార్‌ను అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు కారణం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు.. ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యం. ఆ తర్వాత ఈ కాంబోలో వచ్చిన సినిమాలు ఏ రేంజ్‌లో హిట్టయ్యాయో.. మహేశ్‌కు ఎంత పేరు తెచ్చిపెట్టాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఇవన్నీ అటుంచితే.. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’. ఈ సినిమాను మహేష్‌తో మాత్రమే చేయాలని కథ సిద్ధం చేసుకున్న పూరీ ఎన్నో ఏళ్లుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. అయితే మహేశ్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉండటం.. అంతేకాకుండా పూరీకి కూడా వరుస ప్లాప్‌లు రావడంతో సూపర్ స్టార్ నటించడానికి కాస్త జంకారట. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూరీ చేసిన వ్యాఖ్యలతో ఈ కాంబోలో అస్సలు సినిమా వచ్చే అవకాశాలు లేనేలేవని తేలిపోయింది.
జనగణమనకు మహేశ్ స్థానంలో.. వరుస హిట్‌లతో మంచి ఊపు మీదున్న విజయ్ దేవరకొండను ఫిక్స్ చేసే యోచనలో పూరీ ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే పూరీ-విజయ్ మధ్య సినిమా స్క్రిప్ట్ డిస్కషన్ జరగనుందట. అయితే ఈ విషయం నిజమా..? అబద్దమా..? అనేది పక్కనెడితే.. విజయ్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. అయితే ఈ కాంబో నిజంగా వర్కవుట్ అవుతుందా..? లేకుంటే అటు తిరిగి.. ఇటు తిరిగి మళ్లీ మహేశ్ దగ్గరికే వెళ్తుందా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.