ఇదేంటి టైటిల్ చూడగానే.. ఎన్టీఆర్‌కు వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించడమేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును అంతా అనుకున్నట్లు జరిగితే ఈ అప్పగింతలు అక్షరాలా నిజమయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అసలు ఈ కీలక బాధ్యతలేంటి..? టీడీపీలో కాకుండా వైసీపీ అధినేత.. యంగ్ టైగర్‌కు బాధ్యతలు అప్పగించడమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అటు సినిమాలు.. ఇటు పొలిటికల్ టచ్ ఉన్న ఏకైక యంగ్ హీరో నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్. 2019 ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే ఈ జగన్ ప్రభుత్వంలో.. ఏపీలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు సంబంధిత శాఖా అధికారులు, మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో పర్యాటకానికి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌ను కూడా నియమించాలని యోచిస్తోందట.
ఇందుకోసం.. ప్రస్తుతం యంగ్ టైగర్ పేరును పరిశీలిస్తున్నారట. ఇందుకు కారణం ఎన్టీఆర్ మెచ్చే.. యంగ్ టైగర్‌కు ఆప్తుడు అయిన మంత్రి కొడాలి నాని, పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావులే కారణమట. వీరిద్దరూ వైసీపీ నేతలే కావడం.. వీరి నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు వైఎస్ జగన్.. ఎన్టీఆర్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా.. సినీ హీరోగానే కాకుండా యూత్‌కు రోల్ మోడల్‌గా ఉన్న ఎన్టీఆర్‌నే జగన్ సర్కార్ ఫైనల్ చేస్తుందా లేదా..? వేచి చూడాల్సిందే మరి.