Advertisementt

హార‌ర్ గేమ్ ‘వైకుంఠ‌పాళి’ ఆడియో విడుదల

Mon 22nd Jul 2019 03:13 AM
vaikuntapaali,audio,release,highlights  హార‌ర్ గేమ్ ‘వైకుంఠ‌పాళి’ ఆడియో విడుదల
Vaikuntapaali Audio Released హార‌ర్ గేమ్ ‘వైకుంఠ‌పాళి’ ఆడియో విడుదల
Advertisement
Ads by CJ

హార‌ర్ గేమ్ ‘వైకుంఠ‌పాళి’ ఆడియో లాంచ్‌

ఎస్‌కెఎమ్‌య‌ల్ ప‌తాకంపై అజ్గ‌ర్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో కాండ్రేగుల ఆదినారాయ‌ణ నిర్మిస్తోన్న చిత్రం ‘వైకుంఠ‌పాళి’. సాయికేత‌న్, మేరి హీరో హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ  చిత్ర ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శనివారం హైద‌రాబాద్‌లోని ఫిలించాంబ‌ర్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ నిర్మాత కె.య‌స్‌.రామారావు  ఆడియో లాంచ్ చేశారు.  అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర నిర్మాత కాండ్రేగుల ఆదినారాయ‌ణ నాకు చాలా కాలంగా ప‌రిచ‌యం. సినిమాల ప‌ట్ల ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తి. ఆయ‌న థాట్స్ విభిన్నంగా ఉంటాయి.  ‘వైకుంఠ‌పాళి’ టైటిల్, ట్రైల‌ర్ ఇలా ప్ర‌తిది కొత్త‌గా ఉంది. కొత్త కాన్సెప్ట్స్ ఆద‌రిస్తోన్న ఈ త‌రుణంలో ఈ సినిమా కూడా స‌క్సెస్ సాధించి చిత్ర యూనిట్ అంద‌రికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. 

ద‌ర్శ‌కుడు వీర‌శంక‌ర్ మాట్లాడుతూ... ‘‘టైటిల్ చాలా క్యాచీగా  ఉంది. ఇంత వ‌ర‌కు తెర‌పై రాని  హార‌ర్ గేమ్  అంటున్నారు. సినిమా స‌క్సెస్ సాధించాల‌నీ, ప‌ని  చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు రావాల‌ని కోరుకుంటున్నా’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర మాట్లాడుతూ... ‘వైకుంఠ‌పాళి’ అంద‌రికీ బాగా తెలిసిన ఆట‌. అలాంటి గేమ్ తో ఒక హారర్ సినిమా  చేయాల‌నుకోవ‌డం అనేది అద్భుత‌మైన ఆలోచ‌న‌. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల‌కు  మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోన్న ఈ స‌మ‌యంలో ఇలాంటి ప్ర‌య‌త్నం చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా శుభాకాంక్ష‌లు’’ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు అజ్గ‌ర్ అలీ మాట్లాడుతూ... ‘‘ఈ సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ వ‌ర‌కు వ‌చ్చిందంటే ప్ర‌ధాన కార‌ణం మా నిర్మాత కాండ్రేగుల ఆదినారాయ‌ణ‌గారు. కొత్త వార‌మైనా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా మాకు పూర్తి స్వేచ్ఛ‌నిచ్చి సినిమా బాగా రావడానికి స‌హ‌క‌రించారు. ఇలాంటి నిర్మాత‌లు ఉంటే సినిమా విడుద‌ల కోసం క‌ష్టాప‌డాల్సిన ప‌నేలేదు. ఇక వైకుంఠ‌పాలి ఓ కొత్త పాయింట్ తో తీసాం. అంద‌రికీ క‌నెక్టవుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం’’ అన్నారు.

చిత్ర నిర్మాత కాండ్రేగుల ఆదినారాయ‌ణ మాట్లాడుతూ... ‘‘ఇంత వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్ పై  రాని హార‌ర్ గేమ్ చిత్రం ‘వైకుంఠ‌పాళి’. సాయి కేత‌న్ ఇందులో అండ‌ర్ క‌వ‌ర్ కాప్ గా న‌టించాడు. మా ద‌ర్శ‌కుడు నేను రాసుకున్న క‌థ‌కు పూర్తి న్యాయం చేసాడు. మా సినిమాకు ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ప్ర‌తిభావంతులు కావ‌డంతో సినిమా అనుకున్న దానిక‌న్నా చాలా బాగా వ‌చ్చింది.  మంచి కంటెంట్ ఉంటే... చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడ‌కుండా థియేట‌ర్స్ ఇస్తున్నారు. అంతేకానీ థియేట‌ర్స్ చిన్న సినిమాల‌కు దొర‌కడం లేద‌నేది అంతా ట్రాష్. మంచి కంటెంట్ లేకుంటే ఎవ‌రూ రిలీజ్ చేయ‌డానికి ముందుకు రారు. మా సినిమా ఇప్ప‌టికే బిజినెస్ పూర్తైంది. ఈ నెల 23న గ్రాండ్ గా సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ఇక ఇదే బేన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 5గా ‘మిస్ట‌ర్ లోన్లీ’ ( వీడి చుట్టూ అమ్మాయిలే ట్యాగ్ లైన్) ఈ చిత్రం త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌బోతున్నాం. దీనికి హ‌రీష్ కుమార్ ముక్కి ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నారు. య‌శ్ పూరి హీరోగా ప్రియావ‌ల్ల‌భి, నీల‌మ్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్ర లోగోను ప్ర‌ముఖ నిర్మాత  కెయ‌స్ రామారావుగారు చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో తుమ్మ‌ల‌పల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, సురేష్ కొండేటి, సాయి వెంక‌ట్, సంగీత ద‌ర్శ‌కుడు ప్ర‌మోద్‌, హీరో సాయి కేత‌న్ హీరోయిన్స్ ప్రియా వ‌ల్ల‌భి, నీల‌మ్ తో పాటు చిత్ర యూనిట్  స‌భ్యులు పాల్గొన్నారు

Vaikuntapaali Audio Released:

Vaikuntapaali Audio Release highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ