Advertisementt

మైత్రీ మూవీస్ నుంచి ఆ నిర్మాత తప్పుకుంటున్నారు

Mon 22nd Jul 2019 01:53 AM
mythri movies,partners,bond broken,mohan,out  మైత్రీ మూవీస్ నుంచి ఆ నిర్మాత తప్పుకుంటున్నారు
Mohan out of Mythri Movie Makers! మైత్రీ మూవీస్ నుంచి ఆ నిర్మాత తప్పుకుంటున్నారు
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో పెద్దపెద్ద సినిమాలు తీసే మైత్రీ మూవీస్ వారి నుండి చాలానే సినిమాలు వచ్చాయి. వీరికి పేరు వచ్చిన సినిమాలంటే ‘రంగస్థలం, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు’. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సంస్థ వరస సినిమాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతుంది. ఇక మైత్రీమూవీస్.. పేరులో మై..త్రీ అని వుండటానికి కారణం నవీన్, రవిశంకర్, మోహన్ సివివి అనే ముగ్గురు స్నేహితులు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మైత్రి నుంచి ఒక్కరు తప్పుకుంటున్నారు అని టాక్.

మోహన్ సివివి ఈ నిర్మాణ సంస్థ నుంచి తప్పుకుంటున్నారు. ఇకపై మైత్రి మూవీస్‌కి ఇద్దరే భాగస్వాములుగా మిగలబోతున్నారు. ముగ్గురు స్నేహితులు కావడంతో ఈ బ్యానర్‌ని స్టార్ట్ చేసారు. కానీ ఇప్పుడు మోహన్ తప్పుకుంటున్నాడు. మరి ఇంతకీ మోహన్ సివివి తప్పుకోవడానికి కారణం ఏమై ఉంటుంది. పేరుకు ముగ్గురు నిర్మాతలు కానీ ఇద్దరే పెట్టుబడి పెట్టే భాగస్వాములు. ఏదో ఫైనాన్షియల్ గా ప్రొబ్లెమ్స్ రావడంతో తప్పుకున్నారు అని తెలుస్తుంది. అంతే కాదు మోహన్ తరచు అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి వ్యవహారాలు చూసుకోలేకపోవడం ఇంకో కారణం అంటున్నారు. మరి మోహన్ వెళ్ళిపోయినా తరువాత ఇంకొకరిని యాడ్ చేసుకుంటారా? లేదా బ్యానర్ నేమ్ మార్చి కంటిన్యూ అవుతారా? అనేది తెలియాల్సిఉంది.

Mohan out of Mythri Movie Makers!:

Mythri Movies Partners Bond Broken  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ