సాహో సినిమా ఆగష్టు 15 కి వస్తుంది అనగానే.. శర్వానంద్, అడివి శేష్ లు తమ సినిమాలు ఎప్పుడు విడుదల చెయ్యాలో తెలియక తలలు పట్టుకున్నారు. శర్వానంద్ రణరంగం సినిమా ఆగష్టు లోనే విడుదల చెయ్యాలనుకున్నాడు. కానీ ప్రభాస్ సాహో భూతంలా కనబడింది. ఇక అడివి శేష్ ఎవరు సినిమా కూడా అంతే. ఇక సాహో ఆగష్టు 15 నుండి ఆగష్టు 30 కి పోస్ట్ పోన్ అవగానే సాహో డేట్ ని అడివి శేష్, శర్వాలు లాగేసుకున్నారు. ఇక ఆగష్టు 30 న సాహో వస్తుంది అనగానే ముందుగా టెన్షన్ తో తల పట్టుకున్న హీరో నాని. నాని గ్యాంగ్ లీడర్ ఆగష్టు 30 నే విడుదల కాబోతుంది.
సాహో సినిమాతో పాటుగా నాని తన గ్యాంగ్ లీడర్ ని విడుదల చేస్తే.. సాహో సునామీలో కొట్టుకుపోవడం ఖాయం. ఒక భారీ సినిమాకి ఎదురెళ్లి నిలబడడం అంత మంచిది కాదు కాబట్టి ఇప్పుడు నాని గ్యాంగ్ లీడర్ డేట్ మారొచ్చనే ప్రచారం మొదలైంది. ఇక తాజాగా మరో హీరో కూడా సాహో విడుదల డేట్ చూసి టెన్షన్ పడుతున్నాడు. హరీష్ శంకర్ - వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న వాల్మీకి సినిమా కూడా సెప్టెంబర్ 6 న విడుదలకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు సాహో ఆగష్టు 30 కి వస్తుంటే... తమ సినిమాని కూడా పోస్ట్ పోన్ చేస్తేనే బావుంటుందనే ఆలోచనలో వాల్మీకి టీం ఉందట. మరి నిన్నమొన్నటివరకు సాహో రిలీజ్ డేట్ విషయంలో శర్వా, అడవి శేష్ పడిన టెన్షన్ ఇప్పుడు నాని, వరుణ్ లు పడుతున్నారు.