పోకిరి సినిమా అప్పటినుండి బిజినెస్ మ్యాన్ వరకు... అలాగే ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకొచ్చిన దర్శకుడు పూరి.. టెంపర్ తర్వాత మళ్ళీ తన దర్శకత్వంలోని పసని కోల్పోయాడు. మాస్ మాస్ అంటూ మాస్ సినిమాలతోనే కాలం వెళ్లబుచ్చుతున్న పూరి జగన్నాధ్ కెరీర్ ముగిసిపోతుంది అనుకున్న తరుణంలో హీరో రామ్ ధైర్యం చేసి పూరితో సినిమా చేసాడు. రామ్ కూడా సూపర్ హిట్స్ కొట్టలేక సతమతమవుతున్న తరుణంలో పూరి చెప్పిన మాస్ కథకి కనెక్ట్ అయ్యాడు. ఇక పూరి - ఛార్మి కలిసి రామ్ సినిమాని నిర్మించారు కూడా... నిర్మాతగానూ, దర్శకుడిగానూ ఫామ్ కోల్పోయిన పూరితో రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసాడు. పూరి కూడా మునుపటి క్రేజ్ కోసం కసిగా ఇస్మార్ట్ శంకర్ ని తెరకెక్కించాడు. రామ్ కూడా ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చెయ్యడమే కాదు.. మొదటిసారి ఊర మాస్ పాత్రలోకి మారిపోయాడు.
నిన్న గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి ప్రేక్షకులు యావరేజ్ టాకిచ్చినా.... రివ్యూ రైటర్ మాత్రం మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. ఇక ఇస్మార్ట్ శంకర్ గా రామ్ నటన అద్భుతం. మొదటిసారి మాస్ పాత్రలో రామ్.. మాస్ లుక్స్ లో ఇరగదీసాడు. ఈ సినిమాని రామ్ ఒంటిచేత్తో ఎనర్జిటిక్ నటనతో నడిపించాడు. పూరి కూడా ఈ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో కష్టపడ్డాడు. కాకపోతే కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవడం, కామెడీని తగ్గించడం, హీరోయిన్స్ ని మరీ ఎక్కువ గ్లామర్ చూపించడం చేసాడు కానీ... లేదంటే సినిమాకి హిట్ టాక్ పడేది.
కానీ పూరి గత సినిమాల ప్లాప్స్ ని పక్కన పడేసి మరి ప్రేక్షకులు ఇస్మార్ట్ మీద ప్రేమ చూపించారు కాబట్టి... రామ్ - పూరిల ఇస్మార్ట్ శంకర్ కి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. రామ్ ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే చిత్రాలకు, పూరి మెహబూబా సినిమాలకు పావువంతు ఓపెనింగ్స్ వస్తే.. ఇప్పుడు వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ కి ఫుల్ అండ్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. మరి టాక్ తో సంబంధం లేకుండా ఈ వీకెండ్ గనక ఇస్మార్ట్ కలెక్షన్స్ అదిరిపోతే.. నాన్ థియేట్రికల్ రైట్స్ 18 కోట్లు ఈ సినిమా కొల్లగొట్టడం పెద్ద కష్టం కాదు.. మరి రామ్ స్టామినా, పూరి క్రేజ్ ఈ సినిమా కలెక్షన్స్ ని ఏ తీరానికి చేరుస్తాయో చూడాలి.