‘దొరసాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేవీఆర్ మహేంద్ర గురించి చాలా వరకు తెలియదు. ఆయనేదో ఇప్పటి వరకూ షార్ట్ ఫిల్మ్‌లు తీశారు..? ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్నారని మాత్రమే తెలుసు. అయితే ఇదంతా నాణేనానికి ఒకవైపు మాత్రమే.. రెండో వైపు చూస్తే కన్నీళ్లు మాత్రం అస్సలు ఆగవు.
‘దొరసాని’ సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చింది. అంతే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమాకు బాగా ఆదరించారు. ఎవరు చూసినా సూపర్బ్ అనే చెబుతున్నారు. అయితే.. ఈ క్రమంలో అసలు ఈ మహేంద్ర ఎవరు..? ఎక్కడ్నుంచి వచ్చారు..? అని కనుగొనే పనిలో మీడియా మిత్రులు నిమగ్నమయ్యారు. అయితే ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ చెప్పిన మాటలకు ఒకింత సినిమా ప్రియులు కంటతడిపెట్టుకున్నంత పనైంది.
తనకు ఓ సినిమా టీమ్‌లో ఒకరు ఛాన్స్ ఇప్పిస్తానని కబురుచేస్తే హైదరాబాద్ వచ్చానని అయితే ఆ పని కాకపోవడంతో యూసుఫ్‌గూడ బస్ స్టాప్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. అయితే జేబులో డబ్బుల్లేవు ఓ వైపు ఆకలి మాత్రం చంపుతోంది.. అసలే అర్ధరాత్రి దాటింది. అయితే సరిగ్గా ఇదే టైమ్‌లో అరటిపండ్లు అమ్మే వ్యక్తి కుళ్లిపోయిన పండ్లు పారేయడానికి అటుగా రావడంతో వాటిని తీసుకుని తిన్నానన్నారు. జీవితంలో ఈ సంఘటన నాకు ఒక పాఠం నేర్పిందని మహేంద్ర చెప్పుకొచ్చారు.