నాని - విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్‌లీడర్ ను వాయిదా వేయాలా లేదా ముందుగా అనుకున్న డేట్ కే రిలీజ్ చేద్దామా అనుకుంటున్నారు టీం. ముందుగా ఈసినిమాను ఆగస్టు 30 న రిలీజ్ చేస్తాం అని ప్రకటించారు. అయితే కొన్ని కారణాలు వల్ల ఆగస్ట్ 15 న రావాల్సిన సాహో విడుదల వాయిదా పడి ఆగస్ట్ 30కి మారిందనే వార్త దావానలంలా వ్యాపించింది.
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సాహో ఆగస్ట్ 30న వస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి ఆగస్ట్ 30 న సాహో వస్తే నాని సినిమా ‘గ్యాంగ్‌లీడర్’ మాటేమిది? ప్రభాస్ ముందు నాని నిలబడగలడా? నానికి మార్కెట్ ఉన్నా కానీ సాహోకి ఎదురు వెళ్లడం తెలివైన పని అనిపించుకోదు.
సో నాని డేట్ మార్చుకుంటే బెటర్ అని కొంతమంది అంటున్నారు. ఒకవేళ సాహో కనుక ఆగస్ట్ 30 న రాకపోతే బెటరే కానీ ఎందుకన్న మంచిది సేఫ్ డేట్ ఆలోచించుకోవడం బెటర్. అటు హీరో నాని కూడా డేట్ మార్చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నాడట.