హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు కాంబినేషన్‌లో బాలీవుడ్ దర్శకుడు నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ రొమెడీ చిత్రం
‘హైదరాబాద్ బ్లూస్’,‘ఇక్బాల్’ వంటి సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ డైరెక్టర్ నగేశ్ కుకునూర్. ఈయన కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు.
స్పోర్ట్స్ రొమెడీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఆగస్ట్‌లో చివరి షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు సపోర్ట్ చేసే హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
నటీనటులు:
కీర్తిసురేశ్
ఆది పినిశెట్టి
జగపతిబాబు
రాహుల్ రామకృష్ణ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: నగేశ్ కుకునూర్
సమర్పణ: దిల్‌రాజు(శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
బ్యానర్: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత: సుధీర్ చంద్ర
కో ప్రొడ్యూసర్: శ్రావ్యా వర్మ
మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: చిరంతన్ దాస్